రాష్ట్రీయం

రైతులకు ఉపశమనం కలిగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఉపశమనం కలిగించే విధంగా వచ్చే మూడు రోజుల్లోగా ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు సహాయ చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. రైతుల ఆత్మహత్యలను నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోంస్లే, జస్టిస్ ఎస్‌వి భట్ విచారించారు. రైతుల ఆత్మహత్యల నిరోధానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు నష్టపరిహారం సొమ్మును చెక్‌ల రూపంలో కాకుండా ఆన్‌లైన్ ద్వారా వారి కుటుంబ సభ్యుల ఖాతాలకు బదిలీ చేయాలని ఆదేశించింది. చెక్ రూపంలో ఇవ్వడంలో దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయన్నారు. అధికారులు ఈ సొమ్ములో 20 శాతం లంచంగా ఇవ్వాలని రైతుల కుటుంబాలను డిమాండ్ చేస్తున్నాయన్నారు. రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. మహబూబ్‌నగర్ జిల్లాలో కొంత మంది అధికారులు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులకు నష్టపరిహారం సొమ్ము చెల్లించే సందర్భంగా అవినీతికి పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. రెండు రాష్ట్రాలు సీనియర్ అధికారుల ఫోన్ నంబర్లను రైతులకు అందుబాటులో ఉంచాలని, ఫిర్యాదులను వాట్సప్ ద్వారా ఇస్తారని, వీడియో, ఫొటోల ద్వారా ఫిర్యాదులను పోస్టింగ్ చేసే అవకాశం ఉందన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆ దురదృష్టకర సంఘటన జరిగిన తర్వాత సహాయం చేసే కంటే, రైతుల్లో విశ్వాసం కలిగించే విధంగా, ఆదుకునే విధంగా ముందుగానే ప్రభుత్వాలు మేలుకుని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. రైతుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ శరత్ కుమార్ వాదనలు వినిపిస్తూ, ప్రొఫెసర్ కోదండరామ్ రైతుల సంక్షేమం కోసం చేసిన సూచనలను పాటించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని నివేదిక ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ పి వేణుగోపాల్ మాట్లాడుతూ, ఈ అంశంపై సోమవారం కోర్టు ఎదుట విచారణకు వచ్చినప్పుడు సీనియర్ అధికారులు లేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసిందని, రైతుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలపై ప్రచారం చేపట్టామన్నారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది బాలాజీ వదేరా వాదనలు వినిపిస్తూ తెలంగాణలో కేవలం ఒక రోజు 13 మంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రైతుల ఆత్మహత్యల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై పిటిషనర్ల తరఫున న్యాయవాదులు సి దామోదర్ రెడ్డి, బి రచనారెడ్డి తమ వాదనలు కోర్టుకు వినిపించారు. అనంతరం ఈ కేసు విచారణను రెండు వారాల పాటు వాయిదా వేశారు.

లబ్ధిదారుల ఎంపికకు హైకోర్టు అనుమతి
రెండు పడక గదుల ఇళ్ల కేసు మూసివేత
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 1: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, లబ్ధిదారులను ఎంపిక చేయవచ్చునని తెలంగాణ ప్రభుత్వానికి హైదరాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రి కలిసి లబ్ధిదారులను ఎంపిక చేసే విధంగా అక్టోబర్ 15న తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జివో చట్ట వ్యతిరేకం అని హైదరాబాద్‌కు చెందిన జి దేవదాస్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. చీఫ్ జస్టీస్ దిలీప్ బి బోంస్లే, జస్టీస్ ఎస్‌వి భట్‌లతో కూడిన బెంచ్ కేసును విచారించింది. జివోలో మార్పులు చేసినట్టు గ్రామ సభ ద్వారా లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను జిల్లా కలెక్టర్‌కు అప్పగిస్తూ కొత్త జివో జారీ చేసినట్టు ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకు వచ్చింది. ప్రభుత్వం నిర్ణీత సమయంలో ఈ పథకం అమలు చేస్తుందని భావిస్తూ కేసు మూసివేస్తున్నట్టు తెలిపారు. పథకం అమలులో లస్యం జరిగితే పిటీషనర్ కోర్టు దృష్టికి తీసుసు రావచ్చునని న్యాయమూర్తులు తెలిపారు.