రాష్ట్రీయం

వెయ్యి దాటితే వైద్యం ఉచితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (ఆనందపురం), సెప్టెంబర్ 17: తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదవారికి ఉచిత వైద్యం అందిస్తానని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. వెయ్యి రూపాయలు దాటే ప్రతి వైద్యం ఖర్చును తమ ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. అలాగే పేదవాడు శస్తచ్రికిత్స చేయించుకుని ఎన్ని నెలలు విశ్రాంతి తీసుకుంటే, అన్ని నెలలూ భత్యం కూడా ఉచితంగా అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు. జగన్ 264వ రోజు పాదయాత్ర విశాఖ జిల్లాలో సోమవారం కొనసాగింది. ఆనందపురంలో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యమై పోయిందని అన్నారు. కిడ్నీ, క్యాన్సర్ రోగాలకు అరకొర చికిత్స అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోగాలు వచ్చి జనం చచ్చిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడం లేదని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఫోన్ కొట్టిన 10 నిముషాల్లో 108 వాహనం వచ్చి వాలేదని, ఇప్పుడు ఫోన్ చేస్తే అంబులెన్స్ డ్రైవర్లు సమ్మెలో ఉన్నారని, ఆ వాహనానికి డీజిల్ లేదని, టైర్లు లేవన్న సమాధానం వస్తోందని చెప్పారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేసినట్టు చంద్రబాబు చెబుతున్నది నిజం కాదని జగన్ అన్నారు. అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యేలు పుష్పవాణి, రోజా, చరితశ్రీ డ్వాక్రా రుణాల మాఫీ చేశారా? అని లిఖితపూర్వకంగా ప్రశ్నిస్తే, 2014-18 వరకూ డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదని ప్రభుత్వం లిఖితపూర్వకంగానే సమాధానం చెప్పిందని జగన్ అన్నారు. 2014కు ముందున్న 11,069 కోట్ల రూపాయల రుణాలను కూడా మాఫీ చేయలేదని ప్రభుత్వం పేర్కొందని జగన్ చెప్పారు. అలాగే రైతుల రుణాలను కూడా మాఫీ చేయలేదని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పునాదులు కూడా పూర్తి కాలేదని, అయితే, చంద్రబాబు కుటుంబ సమేతంగా
వెళ్లి గ్యాలరీ సినిమా చూపించారని జగన్ విమర్శించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమని జగన్ అన్నారు. బాబు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే గట్టిగా ప్రయత్నించి ఉంటే హోదా వచ్చేదని ఆయన అన్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రకటించారు. ఇప్పుటి వరకూ ఒక్కో నిరుద్యోగికి ఆయన లక్షా 50 వేల రూపాయలు ఇవ్వాల్సి ఉందని, ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని జగన్ అన్నారు. ఫీజు రీ-యింబర్స్‌మెంట్ ఎక్కడా కనిపించడం లేదని అన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు, ఆర్టీసీ, విద్యుత్ చార్జీల ధరలు భయంకరంగా ఒకఓపక్క పెరుగుతుంటే, మరోపక్క స్కూల్, కళాశాలల్లో ఫీజులు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. రాజధాని భూముల్లో, మద్యం కొనుగోళ్లలో, కరెంట్ కొనుగోళ్లలో చంద్రబాబు అవినీతి హద్దులు దాటిపోయిందని జగన్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు మళ్లీ ప్రజలకు అబద్ధాలు చెప్పడానికి రానున్నారని, ఆయన మాటలు నమ్మితే, మరోసారి ప్రజలు అన్యాయానికి గురవుతారని అన్నారు. చంద్రబాబు ఓటుకు మూడు వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడని, అది చాలదు ఐదు వేలు అడగండని జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆ డబ్బు అంతా మన జేబుల నుంచి గుంజిందేనని అన్నారు. డబ్బు తీసుకున్నా, మనస్సాక్షికి ఓటు వేయాలని జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదిలాఉండగా చంద్రబాబు అవినీతికి మంత్రి గంటా శ్రీనివాసరావు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారని జగన్ అన్నారు. మంత్రి గంటా వియ్యంకుని కళాశాలల్లో ఫీజులు భారీగా పెంచుతున్నా, ఆత్మహత్యలు జరుగుతున్నా ఆయన పట్టించుకోవడం లేదని అన్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, వాటిపై రుణాలు పొందారని ఆరోపించారు.
కాగా, విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని, తన శిబిరంలో విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి వైసీపీ అధినేత జగన్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, విశాఖ లోక్‌సభ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ఆనందపురం సభలో మాట్లాడుతున్న వైసీపీ అధినేత జగన్