రాష్ట్రీయం

తెరాసను బొంద పెడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను బొంద పెడతామని పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్న పోలీసు అధికారుల సంగతి అప్పుడు చూస్తామని ఆయన హెచ్చరించారు. సోమవారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఉత్తమ్ ప్రసంగిస్తూ రాష్ట్రంలో మరో నిజాం నియంత పాలన సాగుతున్నదని దుయ్యబట్టారు. అణచివేత, నిర్బంధంతోనే పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యవాదులు, పౌర హక్కుల నేతలను అరెస్టులు చేయడం వంటి దుర్మార్గమైన పాలనను కొనసాగిస్తున్నారని సీఎం కేసీఆర్‌పై ఆయన మండిపడ్డారు. వివేకవంతులైన తెలంగాణ ప్రజలు ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించనున్నారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 2014 ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఓటర్ల సంఖ్య పెరగాలే తప్ప, తగ్గకూడదని అన్నారు. అయితే, అనూహ్యంగా ఓటర్లు తగ్గడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని చెప్పారు. సుమారు 30 లక్షల ఓట్లు తగ్గాయని ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త ఓట్ల నమోదు ప్రక్రియతోపాటు సవరణను పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలన్న నిబంధన ఉందని గుర్తుచేశారు. ఓట్ల నమోదు, సవరణల అనంతరం ఎన్నికలకు తాము సిద్ధమేనని ఉత్తమ్ స్పష్టం చేశారు.
పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా మారుస్తామని, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ఉత్తమ్ కార్మిక సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు. టీఎస్‌ఆర్టీసీ స్ట్ఫా అండ్ వర్కర్స్ యూనియన్ తరపున అబ్రహం సోమవారం గాంధీ భవన్‌లో ఉత్తమ్‌కు వినతి పత్రం అందజేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని ఉత్తమ్ వారితో చెప్పారు.

చిత్రం..తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్‌లో జాతీయ
పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి