దేవాదాయ కమిషనరేట్‌కు కొత్త భవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ కమిషనరేట్‌కు విజయవాడలో కొత్త భవనాన్ని నిర్మించేందుకు సంబంధించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు దేవాదాయ కమిషనర్ పంపించిన లేఖపై అధ్యయనం చేసిన ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు (జీఓ ఎంఎస్ నెంబర్ 103) జారీ చేసింది. కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన 6.06 ఎకరాల భూమిని ఇందుకోసం కేటాయించారు. 33 సంవత్సరాల లీజుపై ఈ భూమిని అప్పగించాలని నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ విజయవాడకు తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు దేవాదాయ ధర్మాదాయ కమిషనరేట్‌కు కొత్త భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం దేవాదాయ కమినరేట్ హైదరాబాద్‌లోని (బొగ్గుల కుంట) ధార్మికభవనంలో నడుస్తోంది. ఈ భవనంలో ఒకవైపు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ కమిషనరేట్, మరోవైపు ఎపి దేవాదాయ కమిషనరేట్ నడుస్తున్నాయి.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి
సంజామల, మార్చి 16: కర్నూలు జిల్లా సంజామల మండలంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రమైన అవుకు గ్రామానికి చెందిన గొల్ల మధుతేజ (21), షేక్ రాజు (21), పూసల పెద్దరాయుడు (21) కోవెలకుంట్లలోని డిగ్రీ కళాశాలలో సైన్స్ గ్రూపు చివరి సంవత్సరం చదువుతున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు కళాశాలలో పరీక్ష రాయాల్సి ఉంది. దీంతో ఈ ముగ్గురు 6 గంటల ప్రాంతంలో అవుకు నుంచి మోటార్ సైకిల్‌పై కోవెలకుంట్ల బయలుదేరి, దారిలో సంజామల మండలం ఆకుమళ్ల గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రాజు, పెద్దరాయుడు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన మధుతేజను 108 వాహనంలో కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాలకు కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
దర్శకుడు రాధాకృష్ణన్‌కు గొల్లపూడి పురస్కారం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 16: గొల్లపూడి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ట్రస్టు ప్రతి యేటా ఔత్సాహిక దర్శకులకు ఇచ్చే జాతీయ పురస్కారం దర్శకుడు జయప్రకాష్ రాధాకృష్ణన్‌కు దక్కింది. రాధాకృష్ణన్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఆంగ్లచిత్రం ‘లెన్స్’ చిత్రానికిగాను ఈ అవార్డు ఇస్తున్నట్టు గొల్లపూడి మెమోరియల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు తెలిపారు. విశాఖలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 18 ఏళ్లుగా గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో తొలి చిత్రానికి దర్శకత్వం వహించే ఔత్సాహిక దర్శకులను ప్రోత్సహించే క్రమంలో జాతీయ అవార్డు అందజేస్తున్నామన్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తమిళం, మళయాళం, బెంగాలీ తదితర భాషలకు సంబంధించి 33 నామినేషన్లు అందాయన్నారు. సీనియర్ చలనచిత్ర దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, వసంతసాయి, రోహిణితో కూడిన అవార్డుల కమిటీ 2015 సంవత్సరానికి గాను రాధాకృష్ణన్‌ను ఎంపిక చేసిందన్నారు. ఆగస్టు 12న చెన్నైలోని మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో నిర్వహించే కార్యక్రమంలో రాధాకృష్ణన్‌కు అవార్డుతో పాటు రూ.1.5 లక్షల నగదు పురస్కారాన్ని అందజేయనున్నట్టు ఆయన తెలిపారు.
మారిషస్‌లో 108 అడుగుల శ్రీవారి విగ్రహం
తిరుమల, మార్చి 16: మారిషస్ దేశంలో కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని 108 అడుగుల ఎత్తు కలిగిన ఈ విగ్రహం తయారీకి రూ.38 కోట్లు వ్యయం చేస్తామని మారిషస్ దేశ హరిహర దేవస్థానం ప్రతినిధులైన ఆచార్య బృందావనం పార్థసారథి వెల్లడించారు. బుధవారం కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఆయన విలేఖరులతో ముచ్చటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటుచేసే పనులు గత ఏడాది ప్రారంభమయ్యాయన్నారు. ఇప్పటికి 80శాతంకు పైగా పనులు పూర్తయ్యాయన్నారు. ఈ ఏడాది జనవరిలో ప్రముఖ స్థపతి, కాంట్రాక్టర్ బాలకృష్ణ శివకుమార్‌చే ఈ పనులు నిర్వహిస్తున్నామన్నారు. కుంభాభిషేకానికి ముహూర్తం నిర్ణయించుకుని స్వామివారి ఆశీస్సులు పొందడానికి తిరుమలకు వచ్చాని అన్నారు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వైఖానస ఆగమశాస్త్ర బద్ధంగా కుంభాభిషేకం నిర్వహిస్తామన్నారు. ఈ కుంభాభిషేకానికి మారిషస్ తరపున దేశప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులను ఆహ్వానించనున్నట్లు ఆయన తెలిపారు.
సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్‌ల్‌లో సాయశ్రావణ్‌కు ఫస్ట్ ర్యాంక్
మదనపల్లె, మార్చి 16: కేంద్రప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సైనిక్‌స్కూల్ ప్రవేశానికి అర్హత పరీక్షలో చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన అభ్యుదయ హైస్కూల్ విద్యార్థి ఎం సాయిశ్రావణ్ (హాల్‌టికెట్ నెం.3004) రాష్టస్థ్రాయిలో మొదటిస్థానంలో నిలిచినట్లు స్కూల్ కరస్పాండెంట్ బి ప్రసాద్‌బాబు వెల్లడించారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్టస్థ్రాయిలో జరిగిన కలికిరి సైనిక్‌స్కూల్ ప్రవేశానికి అభ్యుదయ హైస్కూల్ నుంచి 20 మంది విద్యార్థులు హాజరు కాగా అందులో రాష్టస్థ్రాయిలో సాయిశ్రావణ్‌తో పాటు బి తేజేశ్వర్ (3010), పి నవీన్‌కుమార్ (3023), పి జశ్వంత్‌రెడ్డి (3013), పునితేశ్వర్ (3501), రక్షిత (16189) రాష్టస్థ్రాయి మెరిట్‌లిస్ట్‌లోప్రతిభ కనబరచినట్లు వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ లక్ష్మి, ఉపాధ్యాయులు, సహచర విద్యార్థినీ విద్యార్థులు అభినందనలు తెలిపారు.

‘చేనేత కార్మికుల
సమస్యలు పరిష్కరించండి’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 16: చేనేత కార్మికుల సమస్యలను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో చెప్పాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బి జయనాగేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నాడు శాసనసభ జీరో అవర్‌లో ఆయన చేనేత కార్మికుల సమస్యలను ప్రస్తావించారు. అంతర్జాతీయ మార్కెట్‌తో చేనేత వస్త్రాలను అనుసంథానం చేయాలని అపుడే వారికి మార్కెట్ ధర వస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి కె. ఇ కృష్ణమూర్తి మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం తప్పకుండా పరిశీలిస్తుందని అన్నా రు. విలీన మండలాల సమస్యలను ఎపుడు పరిష్కరిస్తారని రాజేశ్వరి ప్రశ్నించారు. రిటైరైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానానే్న అమలుచేయాలని గౌరు చరితా రెడ్డి కోరారు. భూ వివాదాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నారాయణస్వామి కోరగా, అద్దెకు ఉన్న వారు ఇళ్లు ఖాళీచేయని సందర్భాల్లో తగిన పోలీసు చర్యలకు చట్టం ఉండాలని విష్ణుకుమార్‌రాజు అన్నారు.

ముగిసిన ఇంటర్ ప్రధాన పరీక్షలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 16: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షలు బుధవారం నాటితో ముగిశాయి. మరో నాలుగు రోజుల పాటు చిన్నచిన్న సబ్జెక్టులు మిగిలాయి. జియాలజీ, హోం సైన్స్, లాజిక్, బ్రిడ్జికోర్సు, మోడరన్ లాంగ్వేజి, జాగ్రఫీ వంటి సబ్జెక్టులు మిగిలాయి. కాగా 21వ తేదీ నుండి టెన్త్ పరీక్షలు మొదలుకానున్నాయి. ఆంధ్రాలో బుధవారం నాడు సెకండియర్ పరీక్షల్లో ఏడుగురిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదుచేయగా, తెలంగాణలో 32 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదుచేశారు. బుధవారం నాటి పరీక్షకు ఆంధ్రాలో 4,06,973 మంది హాజరుకాగా, తెలంగాణలో 3,94,477 మంది హాజరయ్యారు.