రాష్ట్రీయం

ఆఫ్రికాలో వినాయకుడి ప్రత్యేక వెండి నాణెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయినవిల్లి, సెప్టెంబర్ 17: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆఫ్రికాలోని ఐవరీకోస్టు దేశం విఘ్నేశ్వరుని రూపంతో ప్రత్యేక వెండి నాణేన్ని విడుదలచేసింది. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం స్టేట్ బ్యాంకు ఉద్యోగి ఇవటూరి రవి సుబ్రహ్మణ్యం సేకరించిన ఆ నాణేన్ని సోమవారం అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయ ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. 0.999 స్వచ్ఛతతో కూడిన వెండి నాణెంపై రావి ఆకులో ప్రకృతి చిహ్నమైన ఆకుపచ్చని రంగులో 38.610 మిల్లీమీటర్ల వ్యాసంలో 25గ్రాముల బరువుతో విఘ్నేశ్వరుని రూపాన్ని ముద్రించారు. ఈ నాణేన్ని విఘ్నేశ్వరుని వాహనమైన ఎలుక రూపంలో తయారుచేసిన బాక్సులో పంపించారు. ఈనాణెం భక్తులను విశేషంగా ఆకరిస్తోంది. ఈకార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు మాచిరాజు రవికుమార్, ఆలయ ప్రధాన అర్చకులు సురేష్ పాల్గొన్నారు.

చిత్రం..విఘ్నేశ్వరుని రూపంతో విడుదల చేసిన వెండి నాణెం. దానిని పంపించడానికి రూపొందించిన ఎలుక రూపంలో తీర్చిదిద్దిన బాక్సు