రాష్ట్రీయం

మోహినీ అవతారంలో జగన్మోహనుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 17: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన సోమవారం ఉదయం శ్రీహరి మోహనీ అవతారంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకారార భూషితుడై భక్తులకు దర్శనమిచ్చారు. పక్కనే శ్రీకృష్ణుడు అలంకృతుడై మరో తిరుచ్చిపై భక్తులకు అభయమిచ్చాడు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు కదులుతుంటే భక్తుల కోలాటాలు, డ్రమ్స్ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ ఊరేగింపు అత్యంత రమణీయంగా జరిగింది. ఈ అవతారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగి ఉందని, అదంతా తన లీలా విలాసమని, తన భక్తులు కాని వారు జగన్మాయాలోలులు కాక తప్పదని స్వామివారు చాటి చెబుతున్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరిగింది.

చిత్రం.. తిరుమల మాడ వీధుల్లో మోహినీ అవతారంలో విహరిస్తున్న శ్రీమలయప్పస్వామి