రాష్ట్రీయం

భయంతోనే శాసనసభ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, సెప్టెంబర్ 17: ప్రధాని నరేంద్రమోదీని ఢీకొనలేక అన్ని ప్రతిపక్ష పార్టీలు డీలా పడ్డాయని.. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా భయంతోనే ఎనిమిది నెలలు ముందుగా శాసనసభ రద్దు చేసుకుని ముందస్తు ఎన్నికలు అంటున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ అన్నారు. సోమవారం రాత్రి సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాలను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. గత నాలుగు సంవత్సరాల్లో దేశంలో జరిగిన 21 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో త్రిపురతో పాటు అన్ని రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని.. తెలంగాణాలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. పార్లమెంటు ఎన్నికలతో పాటే శాసనసభ ఎన్నికలు జరిగితే టీఆర్‌యస్ ఓడిపోతుందని భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తానంటున్నారని మంత్రి అన్నారు. నేడు బీజేపీ ఆధ్వర్యంలో హైద్రాబాద్ రాష్ట్ర విమోచన దినోత్సవం జరుపుకుంటున్నామని మహారాష్టల్రోని చంద్రపురిలో తాను జాతీయ జెండా ఎగురవేసి రావటం వల్ల ఆలస్యమైందని అన్నారు. దేశంలో రోజు రోజుకు మోదీ నాయకత్వంలో బీజేపీ విస్తరిస్తుండగా కాంగ్రెస్ క్షీణిస్తోందని అన్నారు. ప్రధాని మోదీ రైతులకు, నిరుద్యోగులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గత నాలుగు సంవత్సరాలలో యూరియా, డీఏపీ రూపాయి ధర పెంచలేదని కనీస మద్దతు ధర వరితో సహా అన్ని పంటలకు ఇచ్చారని అన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించారని, పేద ప్రజలకు ఆయుష్మాన్‌భవ పథకం కింద కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు అందచేస్తున్నారని అన్నారు.

చిత్రం..సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో
కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్‌కు నాగలిని బహూకరిస్తున్న అభిమానులు