రాష్ట్రీయం

పవర్ లిఫ్టర్ అనూషకు ఏపీ సీఎం అభినందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 17: దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్ పవర్ లిఫ్టింగ్ జూనియర్ చాంపియన్‌షిప్ పోటీల్లో రజత పతకం సాధించిన డొంకెన అనూషను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. వెలగపూడిలోని అసెంబ్లీ ఆవరణలో సోమవారం ముఖ్యమంత్రిని ఆమె కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆమెను అభినందించి, ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా 10 లక్షల రూపాయల పారితోషికం ప్రకటించారు. తాను సాధించిన వివిధ పతకాలను సీఎంకు ఆమె చూపించారు. కామనె్వల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధనే లక్ష్యంగా కృషి చేస్తున్నానని తెలిపారు. అనూషకు అన్ని విధాల అండగా ఉండాలని శాప్ చైర్మన్‌ను ఆదేశించారు. కృష్ణా జిల్లా మైలవరం మండలం పొందుగల గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు శ్రీనివాసరావు కుమార్తె అనూష అని సీఎంకు మంత్రి దేవినేని వివరించారు.