రాష్ట్రీయం

రాష్ట్రాల హక్కులు హరించే ప్రయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 17: వన్ నేషన్...వన్ టాక్స్‌గా రూపొందించిన జీఎస్టీ అమలులో మాత్రం వన్ మోదీగానే సాగుతోందని ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. జీఎస్టీ అమలులో ఎదురవుతున్న ఇబ్బందులు, సవరణలపై పలు రాష్ట్రాలు సూచనలు చేస్తున్నప్పటికి వాటిని పట్టించుకోకుండా కేంద్రం తాను అనుకున్నదే చేస్తోందన్నారు. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఆరవరోజు సోమవారం ఆంధ్రప్రదేశ్ వస్తు, సేవల పన్ను (సవరణ) చట్టం - 2018 చర్చలో భాగంగా జీఎస్టీ సవరణల ఆవశ్యకతను ఆర్థిక మంత్రి యనమల వివరించారు. ఏపీకి సంబంధించినంత వరకు జీఎస్టీ నుండి కొన్నింటికి మినహాయింపు కోరినట్లు చెప్పారు. ఇందులో గిరిజన ఉత్పత్తులు, టీటీడీ, జౌళి ఉత్పత్తులు, చేనేత వంటి వాటికి మినహాయింపు కోరినట్లు చెప్పారు. సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా కేంద్రం జీఎస్టీ విషయంలో వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీజేపీయేతర రాష్ట్రాలు జీఎస్టీ కౌన్సిల్‌లో ఇస్తున్న సూచనలను అసలు పరిగణలోనికి కూడా తీసుకోవడం లేదన్నారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసురావడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని యనమల స్పష్టం చేశారు. సమర్థిస్తే 6500 కోట్ల రూపాయలు ఏపీ నష్టపోవాల్సి వస్తుందన్నారు. నష్టపోతున్నందుకు పరిహారం చెల్లించే విషయంలో కేంద్రం కనీసం స్పష్టత ఇవ్వడం లేదన్నారు. రాజ్యాంగం రాష్ట్రాలకు కొన్ని పన్నులు వసూలు చేసుకునే అవకాశం కల్పించిందని, ఆ హక్కులను కూడా కేంద్రం కాలరాయాలని చూస్తోందన్నారు.