రాష్ట్రీయం

బాబ్లీ వివాదంలో మా కుట్రేమీ లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: బాబ్లీ వివాదంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరులకు నాన్ బెయిల్‌బుల్ వారెంట్లు జారీ వెనుక బీజేపీ కుట్రేమీ లేదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సురేష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మహారాష్టల్రోని ధర్మాబాద్ న్యాయస్థానం 22 సార్లు చంద్రబాబుకు సమన్లు జారీచేసినప్పటికీ స్పందించని కారణంగా నాన్ బెయిల్‌బుల్ అరెస్ట్ వారెంట్లు జారీచేసిందన్నారు. వారెంట్ల జారీతో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం సురేష్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడారు. చంద్రబాబుకు సమన్ల జారీ విషయంలో ప్రధాని నరేంద్రమోదీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్నికలకు ముందిచ్చిన హామీలన్నీ అమలుచేయకపోగా తిరిగి బీజేపీపై తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై సీబీఐతో విచారణ జరిపిస్తే అవకతవకలను తాము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పథకాల్లో అక్రమాలకు పాల్పడినట్టు రుజువైన పక్షంలో జైలుకెళ్ళేందుకు చంద్రబాబు సిద్ధమేనా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నోట్లతో ఓట్లు కొనే ప్రయత్నాల్లో ఉన్నారని విమర్శించారు. చంద్రబాబుకు ప్రధాని మోదీ అంటే భయం పట్టుకుందని, ఈ కారణంగానే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో జల యజ్ఞం పేరుతో ధనయజ్ఞం ఏ విధంగా చేశారో, నేడు టీడీపీ ప్రభుత్వం జలహారతి పేరుతో దోపిడీ హారతి చేస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీ రామారావు తెలుగుదేశాన్ని స్థాపిస్తే, నేడు అదే కాంగ్రెస్‌తో జతకట్టడానికి చంద్రబాబు సానుకూలంగా ఉన్నారన్నారు. ఇదే కనుక జరిగితే దివంగత ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే కాంట్రాక్టర్లుగా మారి వనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈనెల 19న కాకినాడలో కిసాన్ సభ, 20న రాష్ట్ర బీజేపీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ భవిష్యత్ వ్యూహాలను రచించనున్నట్టు సురేష్‌రెడ్డి వివరించారు. సమావేశంలో బీజేపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి తుమ్మల పద్మజ తదితరులు పాల్గొన్నారు.