రాష్ట్రీయం

టెక్నాలజీతో పారదర్శకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 18: టెక్నాలజీతో సుపరిపాలన, పారదర్శకత సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పారదర్శకత వల్ల ప్రజల్లో నమ్మకం కలుగుతుందని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆర్టీజీ- పరిపాలన, అభివృద్ధిలో సాంకేతిక విజ్ఞాన సమన్వయం - పర్యవేక్షణ అన్న అంశంపై లఘు చర్చ మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజలకు మేలు జరగాలన్నా, అన్ని విధాలా లాభాం చేకూర్చాలన్నా పరిపాలనపై శ్రద్ధ పెట్టాలన్నారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు దూరదృష్టి ఉండాలని, వాటిని సుపరిపాలన ద్వారా నిజం చేయాలని సూచించారు. పారదర్శకతకు పెద్దపీట వేసినప్పుడే ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు. గతంలో సెల్‌ఫోన్లు విలాస వస్తువని, కానీ ఇప్పుడు అవసరంగా మారిందన్నారు. సెల్‌ఫోన్, టెక్నాలజీ ప్రజలకు స్నేహితులుగా మారాయన్నారు. టెక్నాలజీ వల్ల కచ్చితత్వంతో పాటు సమయం ఆదా అవుతుందన్నారు. ఎవరేమి చేసినా ప్రజలకు సంతృప్తిని, సంతోషాన్ని చేరేవేసే సాధనంగా ఆర్టీజీ మారిందన్నారు. రాష్ట్ర విభజనలో శాస్ర్తియత లేదని, కట్టుబట్టలతో వచ్చాయని, అయినా అధైర్యపడకుండా సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకున్నామన్నారు. విజన్ 2020 గురించి ఎగతాళి చేశారని, 2050 గురించి దేశంలో ఎవరూ ఆలోచించలేదన్నారు. హ్యాపినెస్ గురించి ఎవరూ మాట్లాడటం లేదన్నారు. రెండంకెల వృద్ధి రేటుతో సమ్మిళిత అభివృద్ధి జరిగితే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీ మారుతుందన్నారు. వౌలిక వసతులు ఉండే తప్ప ప్రజల జీవన ప్రమాణాలు పెరగవన్నారు. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే దాకా ఏమేమీ చేయాలో ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. యువనేస్తంకు విశేష స్పందన లభిస్తోందన్నారు. టెక్నాలజీ వల్ల
ప్రజల జీవితాల్లో వెసులు బాటు వచ్చిందన్నారు. స్థూలవ ప్రణాళికలు సూక్ష్మ స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ల్యాండ్ హబ్, భూధార్, ఈ-ఆఫీస్, ఈ-ప్రగతి, సీఎఫ్‌ఎంఎస్ వంటివి అమలు చేస్తున్నామన్నారు. భూగర్భ జలాలు, రిజర్వాయర్లలో నీటిమట్టం రియల్ టైమ్‌లో తెలుసుకుంటున్నామన్నారు. విద్యుత్ సరఫరా , బీమా వంటివి సమర్థంగా అమలు చేస్తున్నామన్నారు. రేషన్ దుకాణ డీలరు ప్రవర్తనపై కూడా నిఘా ఉంచేందుకు టెక్నాలజీ ఉపయోగపడుతోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 23 శాఖలతో ఉపాధి హామీ పథకాన్ని అనుసంధాం చేశామన్నారు. పీడీ ఖాతాలపై లేనిపోని అరోపణలు చేశారన్నారు. అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారన్నారు. అన్ని విభాగాల సేవలు త్వరలో అన్‌లైన్‌లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఐటీ అమలుకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. భవిష్యత్తులో అన్ని పనులను ఇంటి వద్ద నుంచే చేసుకునే పరిస్థితి త్వరలో రానుందన్నారు. 793 సేవలను ఈ-ప్రగతి ఫ్లాట్‌ఫారం మీదకు తీసుకురానున్నామని, ఇప్పటికే 354 సేవలు తీసుకువచ్చామని తెలిపారు. మూడు దశల్లో వీటిని ఈ-ప్రగతి పరిధిలోకి తీసుకువస్తామన్నారు. వీటిని యాప్ స్టోరుతో అనుసంధానం చేస్తామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సేవల పట్ల ప్రజల్లో 90 శాతం సంతృప్తి ఉందన్నారు. అవినీతి ఆరోపణలు లేకుండా చేయడంలో ఇది కీలకం కానుందన్నారు. పాలనలో పారదర్శకత, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల పెట్టుబడిదారుల్లో సంతృప్తి నెలకొందన్నారు. అవినీతి, వేధింపులు లేకుండా చేయడం వల్ల పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగిందన్నారు. కేంద్రం సహకరించపోయినా, మన సమర్థత, పని చేసే విధానం రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతోందన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని చంద్రబాబు అన్నారు. దళారీలు లేకుండా, కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా చేస్తే, ప్రజల్లో సంతృప్తి పెరుగుతుందన్నారు. హ్యాపీనెస్ ఇండెక్స్‌లో ఏపీ 44వ స్థానంలో ఉందన్నారు. పనితో పాటు ఆనందంగా నాణ్యమైన జీవితం గడపాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో కంప్యూటర్ ఒక సాధనం మాత్రమేనన్నారు. మానవ జ్ఞాపక శక్తికి ప్రత్యామ్నాయం లేదన్నారు. కేంద్రం సహకరించకపోయినా, టెక్నాలజీ వల్ల నిలబడగలిగామన్నారు. చేసిన పనులే శక్తివంతమైన ఆయుధాలని, అర్హులందరికీ న్యాయం చేసేందుకు ప్రభుత్వం పని చేస్తోందన్నారు. మానవ సంబంధాలకు టెక్నాలజీ ప్రత్యామ్నాయం కాదని, ప్రజలతో మమేకం కావాలన్నారు.

చిత్రం..అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు