రాష్ట్రీయం

ఆవిష్కరణలు జీవితంలో భాగం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నూతన ఆవిష్కరణలను జీవితంలో భాగంగా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. చైనాలో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ చాంఫియన్స్ వార్షిక సదస్సులో మంగళవారం అసెంబ్లీ ఆఫ్ సిటీ లీడర్స్, గ్రీన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, నూతన ఆవిష్కరణ ప్రోత్సాహానికి తీసుకోవాల్సిన అంశాలపై ఫోరం సభ్యులతో మంత్రి భేటీ ఆయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఐటీ హబ్‌గా మారుతోందని, ఏపీలో నైపుణ్యం ఉన్న యువత ఉందన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ప్రతి నెలా హ్యాక్‌థాన్స్ నిర్వహిస్తున్నామన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయన్నారు. కంపెనీ విస్తరణలో భాగంగా ఏపీలో పెట్టుబడలు పెట్టాలని హియర్ టెక్నాలజీస్ ప్రతినిధులను కోరారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రాజెక్టు లీడ్ జయంత్ నారాయణ్‌తో సమావేశమయ్యారు. మొదటి సారిగా ఇండియాలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సు ఏర్పాటు చేస్తున్నట్లు నారాయణ్ తెలిపారు. ముంబై కేంద్రంగా సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సు ఫర్ డ్రోన్స్, బ్లాక్ చైన్, ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డ్రోన్లను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఐఓటీ పరికరాలను ఉపయోగించి రియల్ టైమ్‌లో సమచారం తెలుసుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సు కార్యకలాపాలు ఏపీకి విస్తరించాలని కోరారు. ఏపీతో కలిసి పనిచేసేందుకు నారాయణ్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఏఐఐబీ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ వాన్ ఆమ్స్బర్గ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మంత్రి వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరగా, ఏపీకి సహకరిస్తామని హామీ ఇచ్చారు.

చిత్రం..చైనాలో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో మాట్లాడుతున్న మంత్రి లోకేష్