రాష్ట్రీయం

విద్యుత్ ‘ఔట్ సోర్సింగ్’ క్రమబద్ధీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విద్యుత్‌శాఖలో ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించడానికి న్యాయపరమైన అడ్డంకులు తొలిగిపోవడం పట్ల అపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మానవీయతతో తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించడం ఆనందకరమని సీఎం వ్యాఖ్యానించారు. విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్ల (ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు) సేవలను క్రమబద్ధీకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేసారు. 23 వేల మంది ఉద్యోగులకు ఇది పండుగ దినంగా సీఎం అభివర్ణించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు శ్రమ దోపిడికి గురికావద్దని, మంచి జీవన ప్రమాణాలతో వారు జీవించాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌తో సీఎం మాట్లాడారు. సమర్థవంతంగా వాదనలు వినిపించి ఆర్టిజన్ల జీవితాల్లో వెలుగులు నింపారని సీఎం అభినందించారు. ఆర్టిజన్ల సర్వీసులను వెంటనే క్రమబద్ధీకరించాలని, రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి పే స్కేల్ ఖరారు చేసి, పిఆర్‌సి అమలు చేయాలని ప్రభాకర్‌రావును సీఎం ఆదేశించారు. రెగ్యులర్ కాబోతున్న ఆర్టిజన్లకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ విద్యుత్‌శాఖ అధికారులను గతంలో సీఎం ఆదేశించగా, గత ఏడాది నాలుగు విద్యుత్ సంస్థలు ఆదేశాలు జారీ చేసాయి. అయితే వీరి సర్వీసుల క్రమబద్దీకరణను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణకు రాగా ప్రమాదపుటంచుల్లో నిత్యం విధులు నిర్వహిస్తున్నారని, ప్రత్యేక నైపుణ్యం గల వారి సర్వీసులను క్రమబద్ధీకరించక పోవడం వల్ల కలిగే ఇబ్బందులను ప్రభుత్వ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారన్నారు. మెరుగైన విద్యుత్ సరఫరా కోసం కష్టపడుతున్న ఆర్టిజన్లు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగానే
ఉంటున్నారని, ఉద్యోగ భద్రత లేదని విద్యుత్ శాఖ తరఫున వినిపించిన వాదనను హైకోర్టు సమర్థించిందన్నారు.
హైకోర్టు తీర్పుతో ఆర్టిజన్లుంతా ఇక నుంచి రెగ్యులర్ ఉద్యోగులేనని జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుప్రకటించారు. ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం అమలుకు అడ్డంకులు తొలిగిపోయాయన్నారు. వీరికి త్వరలోనే స్కేల్ ఖరారు చేసి పీఆర్‌సి ఆమలు చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.