రాష్ట్రీయం

కేసీఆర్‌కు బుద్ధి చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: అపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని టీ పీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, అవుట్ సోర్సింగ్, పెన్షనర్లు తెలంగాణ ఉద్యమంలో ముందున్నారని టీఆర్‌ఎస్ వచ్చాక వారిపట్ల కిరాతంగా వ్యవహిరించిందని ఆయన ఆరోపించారు. ఎందరో యువకులు, విద్యార్థులు తెలంగాణ కోసం బలైపోయారని ఆయన అన్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంగళవారం వారినుద్దేశించి బహిరంగ లేఖ విడుదల చేశారు.
కేసీఆర్ ఈ నాలుగేళ్లూ ఉద్యోగులను మనుషులుగా, ప్రభుత్వ భాగస్వాములుగా గుర్తించలేదని ఆయన విమర్శించారు. రకరకాల పథకాలు పెట్టి రేయింబవళ్లూ వారిచేత పనిచేయించుకున్నారని ఉత్తమ్ అన్నారు. ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటూ కనీసం ఒక్కసారి కూడా డీఏను సమయానికి ఇవ్వలేదని ఆయన విమర్శించారు. జిల్లాల విభజన చేసి ఉద్యోగులను, వారి కుటుంబాలను వేరు చేసి ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని ఆయన దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలు కష్టాలపాలయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.