రాష్ట్రీయం

స్వదేశీ పరిజ్ఞానంతో ‘అప్సర’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, సెప్టెంబర్ 18: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అణు పరిశోధనల కోసం రూపాంతరం చెందుకుని సిద్ధంగా ఉంది రీసెర్చ్ అణు రియాక్టర్ ‘అప్సర’. రియాక్టర్లే అణుపరమాణుశక్తికి వెన్నముకలుగా నిలుస్తాయని, 1950లోనే భారత అణుశక్తి పితామహుడు హూమి జహంగీర్‌బాబా చెప్పిన విషయాలన్ని ఇప్పుడు నిజం అవుతున్నాయి. ఇంతే కాకుండా ఆయన ముందు చూపుతో చేసిన సూచనలు ఇప్పుడు భారతదేశ ముఖ చిత్రానే్న మారుస్తున్నాయి. దేశంలో అణుశక్తి ప్రయోగాలకు బీజం పడే సమయంలో పురుడు పోసుకున్న అప్సర రీసెర్చ్ రియాక్టర్ మళ్లీ వినియోగంలోకి వచ్చింది ఇప్పుడు. చూడటానికి స్విమ్మింగ్‌ఫూల్ అకృతితో ఉండే ‘అప్సర’ పరిశోధనా అణురియాక్టర్ ఈనెల 10వతేదిన తన పూర్వ వైభవాన్ని సంతరించుకుని ముందుకు వచ్చింది. ముంబాయి సమీపంలోని ట్రోంబేలో గల బాబా అటమిక్ రీసేర్చ్ సెంటర్(బార్క్)లో అప్సర కొలువు దీరిందని, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటోమిక్ ఎనర్జీ(డిఎఇ) ప్రజాసంబందాల అధికారి రవీశంకర్ తెలిపారు. ఆసీయా ఖండంలోనే ఇది మొట్టమొదటి అణురిసెర్చ్ రియాక్టర్ అప్సర ట్రోంబేలో 1956 ఆగస్టులో ప్రారంభమై భారతదేశ అణు శక్తికి అప్సర అత్యంత కీలకంగా మారిందన్నారు. ఇప్పుడు దేశ సేవలో ఈ రియాక్టర్ అందిస్తున్న సేవలు అద్భుతం అని చెప్పొచ్చు. 2009లో ఈ రియాక్టర్ సెవలను అనివార్యకారణాల వల్ల నిలిపివేయబడ్డాయి. నిలిపివేయబడిన దీని సేవలను మన దేశ అణుశాస్తవ్రేత్తలు అప్సర రిసెర్చ్ రియాక్టర్‌ను వినియోగంలోకి తెచ్చి మన దేశ సత్తాను చాటారు. పూర్తి స్వదేశి పరిజ్ఞానంతో గతంలో కన్న రెట్టింపైన సామార్థ్యంతో స్విమ్మింగిపూల్‌ను మరిపించే స్థాయిలో డిజైన్‌తో మళ్లీ ‘అప్సర’ పురుడు పోసిన భారత అణుశాస్తవ్రేత్తలను యావత్ భారతావని కొనియాడుతోంది. న్యూక్లియర్ ఫిజిక్స్, మెటేరియల్ సైన్స్, రేడియోషన్ షీల్డింగ్ అంశాలను ఈ రియాక్టర్‌కు వినియోగిస్తారు. ఇప్పటికే అణుశక్తి వల్ల వ్యవసాయరంగ అభివృద్ధికి పరిశోధనలు, మందుల తయారికి, అలాగే మందుల తయారిల వాడకంలో ఉపయోగించే భార జలంతో పాటు అణువిద్యుత్ ఉత్పదానకు రియాక్టర్లను వినియోగిస్తుంటారు. ఇప్పుడు కొత్తగా క్యాన్సర్ వ్యాధినివారణ కోసం కూడా అణుశక్తి ద్వారా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు మన దేశంలోనే అణుపరిశోధలకు ‘అప్సర’ రిసెర్చ్ రియాక్టర్ సిద్ధం కావడంతో ఇది దేశ ప్రజలకు ఎన్నో సేవలు అందించబోతోంది. అనుంబంధం ఎంతో మంచిదని ఇప్పటికే ఎన్నో ప్రయోగాల ద్వారా ప్రజలకు చేకూరుతున్న, లబ్దిని బట్టి ఇప్పుడిప్పుడే ప్రజలు చైతన్యవంతులు అయి అనుబంధంపై ఉన్న అపోహాలు, అనుమానాలను నివృత్తి చేసుకుంటున్నారు. ప్రజల్లో దీనిపై పూర్తి స్థాయిలో చైతన్యం కల్పిస్తే దేశంలో అనేక రంగాల అభివృద్ధికి అణుశక్తి ఎంతో ప్రయోజకారిగా మారనుంది.
చిత్రాలు.. ముంబయిలోని ట్రోంబేలో స్విమ్మింగ్ పూల్ తరహాలో ఉన్న అప్సర రీసెర్చ్ రియాక్టర్
*అప్సర-యు రియాక్టర్ కాంప్లెక్స్