రాష్ట్రీయం

కమనీయం.. రమణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 18: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన మంగళవారం ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనంపై శ్రీనివాసుడు ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదా నం చేశారు. సాయంత్రం 4గంటలకు స్వర్ణ రథోత్సవం కనువిందుగా సాగింది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శేషాచలాధీశుడు శ్రీరాముని అవతారంలో తన భక్తుడైన మనుమంతునిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవ వ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి తిరువీధులలో దర్శనమివ్వడంతో భక్తులు ఆనందపరవశులయ్యారు. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచనగావించిన మహనీయులు కనుక వాహ్యవాహకరూపంలో ఈ ఇరువురునీ చూసిన వారికి వేదాల తత్త్వం ఒనగూరుతుంది.
శ్రీదేవి, భూదేవీ సమేతుడై స్వర్ణరథంపై..
అంతకుముందు శ్రీదేవి, భూదేవీ సమేతుడై శ్రీనివాసుడు స్వర్ణరథంపై విహరిస్తూ భక్తకోటిని అనుగ్రహించారు. సాయం సంధ్యవేళ సూర్య కిరణాలు స్వర్ణరథాన్ని తాకడంతో రథంపై ఉన్న స్వామివారు దేదీప్యమానంగా వెలిగిపోయారు. సుమారు రెండు గంటలపాటు శ్రీనివాసుడు ధగధగా మెరిసిపోతున్న స్వర్ణ రథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహించారు. స్వర్ణరథం శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. స్వర్ణమయమైన రథంలో శ్రీ్భదేవేరులతో మలయప్ప స్వామి భక్తకోటికి దర్శనమిచ్చారు. వాహనం ముందు భాగాన బ్రహ్మశూన్యరథం, గజ, అశ్వ, వృషభాదుల సంరంభం కొనసాగింది. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు వేంకటాద్రీశుడు గజ వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. రాజులను పట్ట్భాషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామి గజవాహనారూఢుడై తిరువీధులలో తిరగడం భక్తులకు మరపురాని దృశ్యం. స్వామి గజవాహనాన్ని అధిష్ఠించిన రోజేకాకుండా ప్రతి రోజు బ్రహ్మోత్సవాల్లో జరిగే వాహన సేవల్లో టీటీడీ గజరాజులు పాలు పంచుకుంటున్నాయి. బ్రహ్మరథం వెనుక అశ్వాలు, వృషభాలతో గజరాజులు కూడా ఠీవీగా నడిచి వచ్చాయి. వాహనం ముందు భక్తుజన బృందాలు, చెక్క్భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్, చిన్న జీయర్, టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, ధర్మకర్తలమండలి సభ్యులు సుధానారాయణ మూర్తి, జేఈఓ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. స్వర్ణ రథంపై విహరిస్తున్న శ్రీమలయప్పస్వామి