రాష్ట్రీయం

త్వరలో అర్చకుల సమస్యల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 18: అనువంశిక అర్చకత్వం, దేవదాయశాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శాసనసభ ఆవరణలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో మంగళవారం వంశపారంపర్య అర్చకత్వానికి సంబంధించి జీవో 76 తుది నోటిఫికేషన్ విడుదల, దేవాలయ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గిరిజాశంకర్, శాసనమండలి సభ్యులు టీడీ జనార్థన్‌తో ఏపీ అర్చక సమాఖ్య, దేవాలయ ఉద్యోగుల పరిరక్షణ సమితి, బ్రాహ్మణ కార్పొరేషన్ ప్రతినిధులు చర్చలు జరిపారు. జీవో 76 విధివిధానాలకు రూపకల్పన జరుగుతోందని, త్వరలో కమిటీతో సమావేశమై జీవో విడుదల చేస్తామని గిరిజాశంకర్ హామీ ఇచ్చారు. అదేవిధంగా దేవాలయ ఉద్యోగుల పదోన్నతులు, జీతబత్యాల నిధి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని సానుకూలంగా స్పందించారు. సమావేశంలో ఏపీ అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల వెంకట రామలింగేశ్వరశాస్ర్తీ, దేవాలయ ఉద్యోగుల పరిరక్షణ సమితి అధ్యక్షులు డి అప్పలాచార్యులు, బ్రాహ్మణ కార్పొరేషన్ కోఆర్డినేటర్, టీడీపీ నాయకుడు సిరిపురపు శ్రీ్ధర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.