రాష్ట్రీయం

కేరళ వరదబాధితులకు రూ. 55 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: కేరళలో వరదబాధితులకు చేయూత ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) సిబ్బంది 55,05,850 రూపాయలు విరాళంగా ఇచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఏపీజీవీబీకి చెందిన అధికారులు, ఉద్యోగులు కలిసి తమ వేతనం నుండి విరాళం ఇచ్చారు. ఈ నిధులను కేరళ ప్రభుత్వానికి పంపించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషిని వారు కోరారు. విరాళంగా పోగు చేసిన డబ్బును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో జోషికి అందించారు. ఏపీజీవీబీ చైర్మన్ వి. నర్సిరెడ్డి, చీఫ్ మేనేజర్ (పర్సనల్ అండ్ హెచ్‌ఆర్‌డీ) కే. వినోద్‌రెడ్డి, సీనీయర్ మేనేజర్ (హెచ్‌ఆర్) వీ. పరంధామ ఆచారి, ఏపీజీవీబీ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎన్. ప్రకాశం, ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రటరీ కే. బిక్షమయ్య సంయుక్తంగా ఎస్‌కే జోషిని సచివాలయంలో మంగళవారం కలిశారు. ఈ డబ్బును కేరళ ప్రభుత్వానికి పంపించాలని నర్సిరెడ్డి తదితరులు జోషిని కోరారు. ఆ తర్వాత నర్సిరెడ్డి తదితరులు మీడియా లాంజ్‌లో విలేఖరులతో మాట్లాడుతూ, కేరళ వరదబాధితులకు తమకు చేతనైన ఆర్థిక సాయం చేశామన్నారు. ఏపీజీవీబి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పనిచేస్తోందని తెలిపారు. 768 బ్రాంచీలు కలిగిన తమ బ్యాంకుకు 1880 మంది మిత్రాలు ఉన్నారని తెలిపారు. రైతులు, చిన్న వ్యాపారులు, మహిళలు, స్వయంసహాయ గ్రూపులకు చేయూత ఇస్తున్నామని వివరించారు. వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే తమ బ్యాంకు డిపాజిట్లపై 0.50 నుండి 0.75 శాతం వడ్డీని అధికంగా ఇస్తోందని వివరించారు.