రాష్ట్రీయం

ఈ దారి ఎందుకు ఎంచుకున్నట్టు...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 18: కొలంబో నుండి బంగారం అక్రమ రవాణాచేస్తూ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం (మధురపూడి) ఎయిరుపోర్టులో ఒక అంతర్జాతీయ స్మగ్లర్ పట్టుబడిన నేపథ్యంలో నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ నెల 14వ తేదీ రాత్రి కొలంబో నుండి హైదరాబాద్ మీదుగా రాజమహేంద్రవరం వచ్చిన ఒక స్మగ్లర్ నుండి 1900 గ్రాముల పేస్టు, పొడి రూపంలో ఉన్న బంగారాన్ని అధికార్లు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు తక్కువగా ఉండే రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టును ఈ స్మగ్లర్ ఎంచుకోవడంతో ఇప్పుడు నిఘా సంస్థల దృష్టి ఈ దిశగా కేంద్రీకృతమయ్యింది. కొలంబో నుండి వచ్చిన ఈ స్మగ్లర్ కోసం హైదరాబాద్ విమానాశ్రయంలో అధికారులు నిఘాపెట్టినా, చాకచక్యంగా తప్పించుకుని, రాజమహేంద్రవరం చేరుకున్నాడు. అయితే అక్కడి నుండి డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికార్లు ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు అధికార్లు స్మగ్లర్‌ను పట్టుకుని, లోదుస్తుల్లో రహస్యంగా తరలిస్తున్న బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతం నిఘా సంస్థలకు కొత్త దర్యాప్తు అనుభవానికి ఆస్కారమిచ్చిందని చెప్పవచ్చు.
అంతర్జాతీయ స్మగ్లర్లు ఎవరూ ఇప్పటివరకు రాజమహేంద్రవరం వంటి డొమెస్టిక్ టెర్మినల్‌ను ఎంచుకున్న దాఖలాలు లేవని అధికారులు అంటున్నారు. వాస్తవానికి డొమెస్టిక్ ఎయిర్ పోర్టుల్లో బంగారు ఆభరణాల రూపంలో ఉన్నపుడు పట్టుకోవడానికి అవకాశం లేదు. అనుమానం వస్తే ఆయా బంగారు ఆభరణాలకు బిల్లులు అడగొచ్చు. అదేవిధంగా నగదు విషయంలో కూడా తనిఖీచేసే అధికారం డిఆర్‌ఐకు మాత్రమే వుంది. అంతర్జాతీయ ఎయిర్ పోర్టుల్లో మాత్రమే డిఆర్‌ఐకు సంబంధించిన విభాగాలు ఉంటాయి. కానీ రాజమహేంద్రవరం డొమెస్టిక్ ఎయిర్‌పోర్టులో డీఆర్‌ఐ విభాగం లేదు. ఇదే ఆలోచనతో స్మగ్లర్ రాజమహేంద్రవరం చేరుకున్నప్పటికీ, ఇక్కడి ఎయిర్‌పోర్టులో నిఘా ప్రమాణాలు పగడ్బందీగా ఉండటంతో తప్పించుకోలేకపోయాడని స్పష్టమయ్యింది. డిఆర్‌ఐ అధికార్లు ఇచ్చిన సమాచారంతో ఎయిర్‌పోర్టులోని నిఘా వ్యవస్థలు సమన్వయంతో స్మగ్లర్‌ను పట్టుకోగలిగాయి.
అత్యాధునిక స్కానర్లతో పటిష్ట నిఘా
రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయంలో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, ఎయిర్‌పోర్టు సెక్యురిటీ విభాగాలు నిఘా వ్యవస్థల్లో పూర్తిస్థాయి ప్రతిభాపాటవాలు కలిగిన వ్యవస్థల్లో మెరికల్లాంటి సిబ్బంది పని చేస్తుంటారు.
వివిధ రకాల పరీక్షల్లో వీరికి శిక్షణ కల్పించి పూర్తిస్థాయి మార్కులు వచ్చిన వారిని ఎంపికచేసి ఇటువంటి ఉద్యోగాలకు నియమిస్తుంటారు. రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో రిజిస్టర్డ్ బ్యాగేజి, హేండెడ్ బ్యాగేజ్ విభాగాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించేందుకు వివిధ నిఘా పరీక్షల్లో తర్ఫీదు పొందిన అనుభవజ్ఞులైన సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుంటారని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రాజ్‌కిషోర్ తెలిపారు. రిజిస్టర్డ్ బేగేజ్ విభాగంలో రెండు అత్యాధునిక స్కానర్లు, హేండెడ్ బ్యాగేజ్ విభాగంలో రెండు అత్యాధునిక స్కానర్లు నిత్యం స్కానింగ్ చేస్తూనే ఉంటాయన్నారు. ఇవి కాకుండా స్టాండ్‌బై కూడా స్కానర్లు వుంటాయని డైరెక్టర్ చెప్పారు. ఇటీవల కొత్తగా కూడా ఒక స్కానింగ్ మిషన్‌ను తీసుకొచ్చామని కూడా చెప్పారు. ఇంత పగడ్బందీ సెక్యురిటీ వ్యవస్థ వుంది కాబట్టే ఈ స్మగ్లర్ ఇక్కడ పట్టుబడ్డాడని పేర్కొన్నారు.
చిత్రాలు.. పొడి, పేస్టుల రూపంలోకి మార్చిన బంగారం