రాష్ట్రీయం

జాతీయ పరీక్షలకు ప్రాక్టీస్ సెంటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ ద్వారా నిర్వహించే ఐఐటి జేఈఈ, నీట్, యూజీసీ నెట్, సీమ్యాట్, జీ ప్యాట్ తదితర జాతీయ స్థాయి ప్రవేశపరీక్షలకు కేంద్ర ప్రభుత్వం ప్రాక్టీస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 33 రాష్ట్రాల్లో 3406 పట్టణాల్లో 2,72,348 కంప్యూటర్లను నెలకోల్పుతోంది. ప్రవేశపరీక్షలకు పేర్లను నమోదుచేసుకున్న వారు ఈ కేంద్రాలకు వెళ్లి తమ ప్రాక్టీసు ప్రారంభించవచ్చు. తెలంగాణలో 17 జిల్లాల్లో 90 పట్టణాల్లో 7230 కంప్యూటర్లను, ఆంధ్రాలో 13 జిల్లాల్లో 122 పట్టణాల్లో 14,437 కంప్యూటర్లను నెలకోల్పుతోంది. మరో పక్క నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ పోర్టల్ ద్వారా దేశవ్యాప్త ఖ్యాతి గడించిన అధ్యాపకుల వీడియో పాఠాలను కూడా అందుబాటులోకి తెచ్చింది. జెఈఈకి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ త్వరలో నీట్‌కు సైతం ప్రాక్టీస్ టెస్టులకు అనుమతించనుంది. చాలా పరీక్షలను ఆన్‌లైన్ విథధానంలోకి తీసుకురావడంతో పరీక్షలకు అభ్యాసం చాలా ముఖ్యం కావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ సకల ఏర్పాట్లు చేసింది. పరీక్షలకు దరఖాస్తు చేసుకునే వారు ముందుగా ఈ కేంద్రాల్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఐఐటి ప్రొఫెసర్ల బోధనాభ్యసన పాఠ్యాంశాలను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తున్నారు. వీటిని స్వయం ప్లాట్‌ఫారం మీద అందించనున్నారు. విద్యార్థులు తమ ఇంటి వద్ద నుండే వీటిని నేర్చుకునే వీలు కలుగుతుంది. ప్రతి శనివారం నాడు ఈ కేంద్రాలు మధ్యాహ్నం 2.30 నుండి 5.30 వరకూ అందుబాటులో ఉంటాయి, ఆదివారం నాడు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ, సాయంత్రం 2.30 నుండి 5.30 వరకూ అందుబాటులోకి వస్తాయి. 689 కేంద్రీయ విద్యాలయాల్లోనూ, 403 జవహర్ నవోదయ విద్యాలయాల్లోనూ వీటిని ఏర్పాటు చేశారు. ఎన్‌టిఏ వెబ్‌సైట్‌తో పాటు ఎన్‌టీఏ స్టూడెంట్ యాప్‌ను కూడా తీసుకొచ్చారు. ఎన్‌టిఏ వెబ్‌సైట్ ద్వారా ఈ మధ్య కాలంలో నిర్వహించిన మాక్ టెస్టులకు 55వేల మంది హాజరయ్యారు. మరో 32వేల మంది మాక్‌టెస్టులను డౌన్‌లోడ్ చేసుకుని పరీక్ష రాశారు. ఎన్‌టీఏ స్టూడెంట్ యాప్ ద్వారా మరో 10 వేల మంది పరీక్ష రాశారు. గూగుల్ హేంగ్ అవుట్ ద్వారా వీడియోకాన్ఫరెన్సింగ్ నిర్వహించి మాక్ టెస్టులను రాసుకునే సౌకర్యాన్ని కల్పించారు.