రాష్ట్రీయం

కమిటీలపై రుసరుసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముందస్తు ఎన్నికలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీ.పీసీసీ)ని ముందుకు నడిపించేందుకు ఏఐసీసీ ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన కమిటీలపై పార్టీలో అసంతృప్తి పెల్లుబికింది. ఢిల్లీ నుంచి ఈ ప్రకటన వెలువడగానే ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వీ హనుమంత రావు గాంధీ భవన్ నుంచి రుసరుసలాడుతూ వాకౌట్ చేశారు. ఏఐసీసీ మరో కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీలపై మాజీ మంత్రి డీకే అరుణ పెదవి విరిచినా, పార్టీ హైకమాండ్ నిర్ణయమే తనకు శిరోధార్యమని అన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఇద్దరు పేర్లు ప్రకటించినా, జాబితాలో ముగ్గురి పేర్లు ఉన్నాయి. అంతేకాకుండా 10 రోజుల క్రితమే టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డికి మూడు కమిటీల్లో స్థానం కల్పించారు. సురేష్ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. దీనిని బట్టి ఏ మాత్రం స్క్రీనింగ్ చేయకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా కమిటీలను అట్టహాసంగా ప్రకటించినట్టు అర్థమవుతోంది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులను, శ్రేణులను చురుగ్గా నడిపించడానికి ఏఐసీసీ 9 కమిటీలను ప్రకటించింది. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కను వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించి, ముందస్తు ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించింది. కాగా తాజా మాజీ ఎమ్మెల్యే ఏ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. అంత వరకు బాగానే ఉంది కానీ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమితులైన భట్టి విక్రమార్క పేరును పార్టీ సమన్వయ కమిటీలో కూడా సభ్యునిగా నియమిస్తూ, పక్కన
మళ్లీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పేర్కొనడం గమనార్హం. అంటే ఇంత గందరగోళంలో ఉన్న కమిటీలపై పార్టీ సీనియర్లు, ఇతర నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
వీ హనుమంత రావును పార్టీ వ్యూహ రచన (స్ట్రాటజీ) కమిటీ చైర్మన్‌గా అధిష్ఠానం నియమించింది. అయితే ఆ పదవి పట్ల వీహెచ్ సంతృప్తిగా లేరు. తాను జనం మధ్య ఉండే వ్యక్తినని, తనకు ప్రచార కమిటీ కావాలని కోరితే, గాంధీ భవన్‌లో కూర్చునే పదవిని ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ గాంధీ భవన్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఛాంబర్‌లో కూర్చుని ఉన్నారు. వీహెచ్ అక్కడికి వెళ్ళి తన అక్రోశాన్ని వ్యక్తం చేశారు. తాను ప్రచార కమిటీ చైర్మన్ పదవిని అడిగానని, గతంలో రాజీవ్ గాంధీ తనకు రథాన్ని కూడా ఇప్పించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు తాను రథాన్ని సిద్ధం చేసుకుంటున్నానని, 75 శాతం రథం పూర్తయ్యిందన్నారు. తాను జనం మనిషిని కాబట్టి గ్రామాల్లో తిరగాలే తప్ప గాంధీ భవన్‌లో కూర్చోలేనని అన్నారు. అందుకు ఆజాద్ స్పందిస్తూ ఈ విషయాన్ని హైకమాండ్‌కు వివరిస్తానని చెప్పారు.
రేవంత్‌కు పెద్ద పీట..!
రేవంత్ రెడ్డికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం పట్ల పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓటుకు నోటు కేసులో ఉన్న రేవంత్‌కు పార్టీలో కీలకమైన పదవి ఇవ్వడం ద్వారా పార్టీ శ్రేణులకు, ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీలో కొత్తగా చేరిన వారికి పెద్ద పీట వేస్తారా? అని ప్రశ్నించారు.