రాష్ట్రీయం

మండలి చైర్మన్ వద్ద శ్రీవారి ఆభరణాల నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 19: శ్రీవారి ఆభరణాలకు సంబంధించి కమిటీ నివేదికను ఎమ్మెల్సీల కోసం మండలి చైర్మన్ వద్ద అందుబాటులో ఉంచనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రకటించారు. రాష్ట్ర శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో బుధవారం ఎమ్మెల్సీలు మాధవ్, పప్పల చలపతిరావు శ్రీవారి ఆభరణాల ఆడిట్ గురించి ప్రశ్నించారు. దీనిపై మంత్రి బ దులిస్తూ, సంవత్సరానికి ఒకసారి టిటిడి బంగారు ఆభరణాలను భౌతిక ధ్రువీకరణను క్రమం తప్పకుం డా చేస్తున్నామని తెలిపారు. రిజిస్టరైన ఆభరణాలను మదింపుదారులు, తదితరుల సమక్షంలో ఆడిట్ చేస్తారని తెలిపారు. రాజకీయాలు దిగజారిపోయాయనడానికి వేంకటేశ్వర స్వామి ఆభరణాలపై ఆరోపణలు చే యడమేని వ్యాఖ్యానించారు. కమిటీ నివేదికను మం డలి చైర్మన్ వద్ద అందుబాటులో ఉంచుతామని, స భ్యులు చూడవచ్చని తెలిపారు. స్విమ్స్‌కు సంబంధించి 9 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, మరో రూ.17 కోట్లు పరిశీలనలో ఉన్నాయని ఎమ్మెల్సీ వై.శ్రీనివాసులు రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బదులిచ్చారు. సీఎఫ్‌ఎంఎస్‌కు అనుసంధానం కావడంలో జాప్యం కారణంగా బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగిందన్నా రు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజ నం అమలుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఎ మ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీష్, ఏఎస్ రామకృష్ణ, తదితరులు సూచించారు. దీనిపై మంత్రి గంటా స్పంది స్తూ, ఈ అంశాన్ని పరిశీలిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి అన్నిలోపాలను సరిచేస్తామన్నారు. రాష్ట్రంలో 16 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని కేఈ కృష్ణమూర్తి ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.