రాష్ట్రీయం

దేశానికి తలమానికంగా ఏపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 20: ప్రపంచాన్ని జయించే శక్తి యువతకు ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా అధిగమించి దేశానికే చిరునామాగా ఏపీ అవుతుందని భవిష్యత్తును ఆవిష్కరించారు. భవిష్యత్తు అంతా నాలెడ్జ్ ఎకానమీదేనన్నారు. కృష్ణా వర్సిటీ పరిధిలో జ్ఞానభేరి కార్యక్రమాన్ని గురువారం విజయవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సాంకేతికత, విజ్ఞానంతో ఏదైనా సాధించగలమన్నారు. ఏపీని నాలెడ్జ్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ఏ దేశానికి లేని శక్తి మన దేశానికి ఉందని, 2030 నాటికి దేశంలో యువత సగటు వయసు 21 సంవత్సరాలుగా ఉంటుందన్నారు. గణితం, ఇంగ్లీషు భాషపై పట్టు ఉన్న యువతను సక్రమంగా వినియోగించుకోగలిగితే ఏదైనా సాధించగలమన్నారు. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలన్నారు. తెలంగాణకు ఐటి రంగం వల్ల 17 శాతం జీఎస్‌డిపి వస్తోందని గుర్తుచేశారు. అధైర్యపడాల్సిన అవసరం లేదని, దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ తయారవుతుందని, దేశానికే ఏపీ చిరునామాగా మారుతుందన్నారు. ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా 2029 నాటికి ఏపీ చేరడం అసాధ్యమేమీ కాదన్నారు. యువతకు బంగారు భవిష్యత్తు ఇచ్చే బాధ్యత తాను తీసుకున్నట్లు స్పష్టం చేశారు. 24 గంటలూ చదవడం వల్ల విసిగిపోయే పరిస్థితి వస్తుందన్నారు. ఇష్టపడి చదివితే ఫలితం వస్తుందని, లేకుంటే శ్రమ మిగులుతుందని అన్నారు. చదువుకుంటే ఉద్యోగాలు, చేయూత ఇచ్చే బాధ్యత తీసుకున్నానన్నారు. సృజనాత్మకతతో ఆలోచించాలని, విద్యార్థులు తమ జ్ఞానాన్ని ఐటి ఫ్లాట్‌ఫారం వేదికపై ఐవోటీ ద్వారా ఫలితాలు సాధించే ప్రయత్నం చేస్తే, ఏదైనా సాధించగలమన్నారు. ప్రపంచంలోనే ఉత్తమ నగరాన్ని నిర్మించే అవకాశం తనకు భగవంతుడు ఇచ్చాడని, అమరావతి గొప్పనగరం అవుతుందన్నారు. మేధావులు ఎక్కువ రోజులు బతికేందుకు అమరావతి వచ్చే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. తాను ఏమైనా పని పట్టుకుంటే వదలిపెట్టనని, నీతివంతమైన పాలన ఇస్తానని తనకు పేరుందని గుర్తుచేశారు. జ్ఞానం సంపాదించి, సమాజ సమస్యలను అనుసంధానం
చేసుకుని పరిష్కారాలను కనుగొనాలన్నారు. కలలు కనాలని, దూరదృష్టి కూడా ఉండాలన్నారు. అనునిత్యం సృజనాత్మకంగా ఆలోచించి గ్లోబల్ కమ్యూనిటీకి సేవ చేయాలన్నారు. డబ్బులు లేకపోయినా ఐటి వినియోగించానని తెలిపారు. దీనివల్ల అవినీతిని నియంత్రించగలిగామన్నారు. భవిష్యత్తు అంతా నాలెడ్జ్ ఎకానమీదేనని, అందుకే తాను దానికి ప్రాధాన్యత ఇచ్చానన్నారు. కేంద్రం సహకరించకున్నా, వివిధ విద్యా సంస్థలను సాధించి తీరుతామని, రానున్న ఐదు సంవత్సరాల్లో పూర్తి చేస్తామన్నారు. 18వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, అక్టోబర్ 2 నుంచి నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు. జీవన ప్రమాణాలు పెంచుకోవడం, నాణ్యమైన జీవితం వల్ల కనీసం 100 సంవత్సరాలు బతికే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తోందని, విద్యార్థులు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా మహేశ్వరరావు, ఎమ్మెలే బొండ ఉమా మహేశ్వరరావు, ఎమ్మెల్సీ అర్జునుడు, ఎఎస్ రామకృష్ణ, కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం, కృష్ణా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కృష్ణా యూనివర్సిటీ నిర్వహించిన కార్యక్రమంలో ‘జ్ఞానభేరి’ మోగిస్తున్న చంద్రబాబునాయుడు