రాష్ట్రీయం

నేడు తీరం దాటనున్న తుపాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 20: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తుపానుగా మారనుంది. ఈ తుపాను కళింగపట్నం-పూరి మధ్య గోపాలపూర్‌కు అతి సమీపంలో శుక్రవారం ఉదయం తీరం దాటనుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలియచేశారు. గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయానికి తీవ్ర అల్పపీడనం కళింగపట్నంకు తూర్పు ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలోను, గోపాలపూర్‌కు ఆగ్నేయ దిశలో 130 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది తుపానుగా మారిన కొద్ది గంటలకే తీరం దాటి, క్రమంగా బలహీనపడనుంది. దీని ప్రభావం వలన ఉత్తరాంధ్రలో శుక్రవారం భారం వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరంలోని
కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు అంటే 19 సెంటీమీటర్లకు మించి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ రెండు జిల్లాల్లో సముద్రపు అల్లకల్లోలంగా ఉంటుంది. కెరలటాలు రెండు నుంచి మూడు మీటర్ల ఎత్తుకు ఎగసిపడే అవకాశం ఉంది. సముద్రపు నీరు పల్లపు ప్రాంతాల్లోకి వచ్చే ప్రమాదం ఉందని, ఇక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. అలాగే తీరం వెంబడి గంటకు 55 నుంచి 75 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఉత్తరాంధ్రతోపాటు రానున్న 48 గంటల్లో ఒడిశాలోని గంజాం, రాయగడ, కోరాపుట్, నవరంగపూర్, పూరీ, ఖుర్దా, జగత్సింగపూర్, బాలేశ్వర్, భద్రక్, కొందమాల్ జిల్లాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపారు. మత్స్యకారులు పడవలను, వేట సామగ్రిని సురక్షిత ప్రదేశాలకు తరలించుకోవాలని సూచించారు. ఏపీలోని అన్ని పోర్టుల్లో ఒకటవ నెంబరు ప్రమాద హెచ్చరికలను ఎగురవేసినట్టు అధికారులు వెల్లడించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఒడిశా నుంచి భారీగా వరద నీరు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పలు నదుల్లోకి చేరనుంది. నదుల్లో నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బలహీనంగా ఉన్న నదుల గట్ల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వరకూ విశాఖ నగరంలో కుండపోత వర్షం కురిసింది. విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద నాలుగు సెంటీమీటర్లు, వాల్తేరులో రెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.

చిత్రం..కుండపోత వర్షానికి విశాఖలో జలమయమైన ఒక ప్రధాన రహదారి