రాష్ట్రీయం

నేడు ధర్మాబాద్‌కు న్యాయవాదుల బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మహరాష్టల్రోని ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన ఆరెస్టు వారెంట్‌కు సంబంధించి ఏపీ న్యాయవాదుల బృందం శుక్రవారం కోర్టుకు హాజరు కానుంది. ఈ నెల 21న తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కోర్టు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ల బృందం ధర్మాబాద్ కోర్టుకు హాజరుకానుంది. ఆరెస్టు వారెంట్లపై మంత్రులు, అధికారులు, న్యాయవాదులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ధర్మాబాద్ కోర్టుకు న్యాయవాదులను పంపించాలని చంద్రబాబు నిర్ణయించి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ నేతృత్వంలో అడ్వకేట్ల బృందాన్ని పంపిస్తున్నారు. ఈ బృందంలో రవీంద్రతోపాటు ఏఏజీ, ఇతర న్యాయవాదులు ఉంటారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన నేతలు, రెండు రాష్ట్రాల సమస్య అయినందున ఈ కేసులో ఏఏజీ పాత్రే కీలకం కానుంది. కేసుకు సంబంధించి ముందుగా రీకాల్ పిటిషన్ వేయనున్న ఏపీ న్యాయవాదులు, అనంతర పరిణామాలతో ముందుకు వెళ్లనున్నారు. రీకాల్ పిటిషన్‌తో చంద్రబాబుపై ఉన్న నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ రద్దు కానుంది. అప్పటి పరిస్థితిని అంచనా వేసి అవసరమైతే హైకోర్టుకు వెళ్లేందుకు కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధమయింది. దీనికి సంబంధించి స్క్వాష్ పిటిషన్‌ను కూడా న్యాయవాదులు వేయనున్నారు.