రాష్ట్రీయం

వైభవంగా గణనాథుని రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాల, సెప్టెంబర్ 20: చిత్తూరు జిల్లాలో కాణిపాకం క్షేత్రంలో వెలసిన వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారికి రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవానికి దేవస్థానం వారు కాకర్లవారిపల్లికు చెందిన ఎత్తిరాజులనాయుడు కుమార్తె మీనాకుమారి, కాణిపాకంకు చెందిన పూర్ణచంద్రారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి కుమారులు హరిప్రసాద్‌రెడ్డి ఉభయదారులుగా వ్యవహరించారు. స్వామివారి మూలవిరాట్‌కు సాంప్రదాయబద్ధంగా అభిషేకం చేసి సుగంధ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ఉదయం సర్పాలంకార భూషితులైన సిద్దిబుద్ధి సమేత వినాయక స్వామివారి ఉత్సవ మూర్తులను ఆలయ అనే్వటి మండపంలో ఉంచి విశేష సమర్పణ చేశారు. ఉత్స వ మూర్తులను మంగళవాయిద్య మేళతాళ ధ్వనుల మధ్య సాంప్రదాయపద్దంగా ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై ఆశీనులు చేశారు. ఉభయదారు లు ఉభయ వరుస తీసుకువచ్చిన అనంతరం స్వా మివారి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మ ధ్యాహ్నం 3గంటలకు రథోత్సవాన్ని ప్రారంభించారు. రథం ముందు భాగంలో అశ్వాలు, వృషభా లు సర్వసైనాధిపతులు వెంటరాగా స్వామివారు రథంపై కాణిపాకం పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈసందర్భంగా భక్తులు రథంపై బొరుగు లు, మిరియాలు, చిల్లర నాణేలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ఈవో పూర్ణచంద్రరావు, ఏసీ వెంకటేశ్, పాలక మం డలి చైర్మన్ సైరేంద్రబాబు, సభ్యులు ఉభయదారుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. రథోత్సవం సందర్భంగా రథంలో ముందుభాగంలో సాంస్కృతిక కా ర్యక్రమాలు, పలువిచిత్ర వేషధారణ, కీలుగుర్రాలు, జానపద నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

చిత్రం..కాణిపాకం వీధుల్లో గణనాథుని రథోత్సవం జరుగుతున్న దృశ్యం