రాష్ట్రీయం

ఎప్పుడంటే అప్పుడే పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: దేశవ్యాప్తంగా పరీక్షల సంస్కరణల్లో భాగంగా వేగంగా తర్ఫీదు పొంది కౌశలాలను, నైపుణ్యాలను పొందే విద్యార్థులకు వారి కోరక మేరకు వార్షిక పరీక్షలకు బదులు ఎప్పుడంటే అప్పుడే పరీక్షలు నిర్వహించే విధానం గురించి యూజీసీ ఆలోచిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో పరీక్షల సంస్కరణలపై ఏర్పాటు చేసిన కమిటీ ఈ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా వార్షిక పరీక్షలకు బదులు ప్రస్తుతం సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నా వాటిని సైతం విద్యార్థి కోరుకునే సమయంలో నిర్వహించడం ఉత్తమమనే యోచనలో యూజీసీ ఉంది. కాగా ఈ నెల 29న దేశవ్యాప్తంగా అన్ని యూనివర్శిటీల్లో సర్జికల్ స్ట్రైక్స్ డే నిర్వహించాలని యూజీసీ వర్శిటీలను ఆదేశించింది. ఆ రోజు యూనివర్శిటీల్లో ఎన్ సీ సీ క్యాడెట్లతో పెరేడ్ నిర్వహించాలని కూడా పేర్కొంది. పాకిస్థాన్‌పై నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ స్మారకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా భారతీయత, భారత చరిత్రపై విద్యార్థుల్లో అవగాహన పెరుగుతుందని భావిస్తున్నారు.
ప్రత్యేక పాఠ్యాంశాలు
బదిరులు ఉపయోగించే సంకేత భాష, అంధులకు ఉద్ధేశించిన బ్రెయిలీ లిపిలను ప్రత్యేక పాఠ్యాంశాలుగా గుర్తించాలని సీబీఎస్‌ఈ భావిస్తోంది. ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు కొన్ని సబ్జెక్టులతో పాటు హాజరు, కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో మినహాయింపులు ఇవ్వాలని ఆ సంస్థ భావిస్తోంది. వాటికి ప్రత్యామ్నాయంగా ఈ రెండు అంశాలను పాఠ్యాంశాలుగా పరిగణించాలని ప్రతిపాదిస్తోంది. ఒకటి రెండు భాషలను తప్పనిసరిగా నేర్చుకోవాలన్న నిబంధన ఉండటంతో వాటికి బదులు ఈ అంశాలను అధ్యయనం చేస్తే సరిపోతుందనే నిబంధనను ప్రవేశపెట్టనుంది. నడవడానికి ఇబ్బంది పడే విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని, వారికి హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపానలపై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను స్వీకరించాలని అనంతరం నిబంధనలవను ఖరారు చేయాలని కూడా సీబీఎస్‌ఈ భావిస్తోంది.
టైమ్ సైన్స్ క్విజ్
టైమ్ సంస్థ నిర్వహించిన సైన్స్ క్విజ్-2018 జాతీయ పోటీల్లో మధురైకి చెందిన ఎన్ గురుచరణ్, హరీష్ నారాయణన్‌లు విజేతలుగా నిలిచారు. దేశంలోనే అత్యధిక సంఖ్యలో పాల్గొనే కేంద్రీకృత క్విజ్ పోటీగా ఆక్వారీజియా గిన్నీస్ రికార్డను కూడా సొంతం చేసుకుందని సంస్థ ఫౌండర్ డైరెక్టర్లు మానెక్ ఎన్ దారువల, పి విశ్వనాథ్‌లు పేర్కొన్నారు.