రాష్ట్రీయం

మాదే ప్రభంజనం.... అంతటా కాంగ్రెస్ పవనాలు వలసలతో బలపడుతున్నాం: ఉత్తమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: రాష్ట్రంలో తమ పార్టీ ప్రభంజనం వీస్తున్నదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ ఆ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సీ కుంతియా, ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కుంతియా, ఉత్తమ్ తదితరులు వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని వెల్లడించారు. రాథోడ్ దంపతులు చేరికతో తమ పార్టీ మరింత బలపడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పార్టీ విజయం సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముందస్తు ఎన్నికలు కాంగ్రెస్-టీఆర్‌ఎస్ మధ్య కాదని, కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య అని ఆయన అభివర్ణించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలోనే రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు. 17 ముఖ్య పంటలకు మంచి ధర కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను, గిరిజనులను అణిచి వేస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. అమరుల త్యాగాలతో తెలంగాణ ఏర్పాటైతే కేసీఆర్ వారిని విస్మరించారని, వారి కుటుంబాలను ఆదుకోలేదని ఆయన విమర్శించారు.