రాష్ట్రీయం

చంద్రబాబే మళ్లీ సీఎం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 21: ఎంతో ప్రాముఖ్యత కలిగిన నెల్లూరు రొట్టెల పండుగ శుక్రవారం నుండి ఘనంగా ప్రారంభంకాగా, చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావాలని రొట్టె పట్టుకొని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మొక్కుకున్నారు. నగరంలోని బారాషహీద్ దర్గాలో ప్రారంభమైన ఈ మహోత్సవానికి తొలిరోజే భక్తులు పోటెత్తారు. సోమిరెడ్డితోపాటు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ కూడా పాల్గొన్నారు. దర్గాను సందర్శించిన మంత్రి నారాయణ అక్కడికి సమీపంలోని స్వర్ణాల చెరువులో బోటు షికారును ప్రారంభించారు. తన కుమార్తె సింధూర, నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్‌లతో కలిసి షికారు చేశారు. దర్గా పరిసరాలలో భక్తుల సౌకర్యార్ధం చేపట్టిన ఏర్పాట్లను మంత్రి పరిశీలించి తగు సూచనలు చేశారు. అలాగే వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా రొట్టెల పండుగలో పాల్గొన్నారు. ముందుగా దర్గాలోని బారాషాహీద్ సమాధుల వద్దకు చేరుకొని ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన అనంతరం స్వర్ణాల చెరువు వద్ద చంద్రబాబునాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ రొట్టెను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజనలో సర్వం కోల్పోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలంటే చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. అయిదు రోజుల పాటు నిర్వహించే ఈ రొట్టెల పండుగకు సుమారు 12 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశముందని, అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భక్తుల భద్రత కోసం అహర్నిశలు కష్టపడుతున్న పోలీస్ సిబ్బంది పనితీరుకు మంత్రి అభినందనలు తెలియచేశారు. కాగా, రాష్ట్ర పండువగా ప్రకటించిన ఈ పండుగకు తొలిరోజే సుమారు రెండు లక్షల వరకు భక్తులు వచ్చి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల తాకిడి ఎక్కువవుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తగిన బందోబస్తు ఏర్పాట్లు చేసింది. రొట్టెల పండుగకు వచ్చే భక్తులతో నెల్లూరు నగరంలో తీవ్ర రద్దీ వాతావరణం నెలకొంది. జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రొట్టెల పండుగలో పాల్గొనేందుకు శనివారం రాత్రి నెల్లూరుకు వస్తున్నారు. ఆదివారం దర్గాను ఆయన సందర్శించనున్నట్లు జనసేన పార్టీవర్గాలు తెలిపాయి.