రాష్ట్రీయం

ఆర్థిక సంఘమే ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వచ్చేనెల 9 నుంచి 11 వరకు ఏపీలో ఆర్థిక సంఘం ప్రతినిధుల పర్యటన
అమరావతి, సెప్టెంబర్ 21: విభజన అంశాలను అమలు చేయటంలేదు.. రాష్ట్ర నిర్మాణ సమస్యలు అభివృద్ధికి ప్రతిబంధకంగా మారుతున్నాయి.. ఈ పరిస్థితుల్లో ఆర్థిక సంఘమే ఆదుకోవాలి.. ఆర్థిక చేయూత నందించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కేంద్ర నిర్వాకంతో ఏర్పడిన నష్టం వల్ల ప్రజలపై భారం పడకూడదని, 15వ ఆర్థిక సంఘం ద్వారా ఏపీకి సరైన న్యాయం జరిగేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. శుక్రవారం ఉండవల్లి గ్రీవెన్స్ హాల్‌లో ఆర్థికశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏపీకి జరిగిన అన్యాయం చక్కదిద్దాలని వినతిపత్రంలో కోరాలన్నారు. విభజన సందర్భంగా 58.32 శాతం జనాభా, 46 శాతం ఆదాయం ఉండేలా అసమానతలు చూపారని, దీని వల్ల నష్టం పెరిగిందన్నారు. నాలుగేళ్లయినా రాష్ట్రం ఇప్పటికీ తేరుకోలేదన్నారు. భౌగోళిక ప్రాతిపదికన ఆస్తులు, జనాభా ప్రాతిపదికన అప్పులు పంచారని, ఇప్పటికీ పునర్విభజన చట్టం అంశాలను అమలు చేయలేదని వివరించారు. ‘నష్టపోయిన రాష్ట్రానికి అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు.. ప్రత్యేకహోదా ప్రతిపత్తి ఇవ్వలేదు.. రాజధాని నిర్మాణానికి ఇచ్చింది అతిస్వల్పం.. వెనుకబడిన జిల్లాలకు అరకొర నిధులిచ్చారు.. విభజనకు ముందు 13 జిల్లాల రాబడి, ఖర్చుల గురించి సరైన లెక్కలులేవు.. 14వ ఆర్థిక సంఘం వేసిన అంచనాలు తప్పాయి’ అని అసహనం వ్యక్తంచేశారు. కొత్త రాష్ట్రం వ్యవసాయాధారిత ప్రాంతం కావడంతో, పారిశ్రామిక రంగం రాబడి అతిస్వల్పమన్నారు. సేవారంగంలో ఆదాయం శూన్యమని తెలిపారు. నాలుగేళ్ల తరువాత పొరుగు రాష్ట్రాల తలసరి ఆదాయం కంటే వెనుకంజలో ఉన్నామన్నారు. 14వ ఆర్థిక సంఘం వేసిన అంచనా రాబడి ఇప్పటి వరకు అందలేదన్నారు. అంచనాల కంటే రుణ భారం అధికమైందని ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రం సేవారంగంలో 8 శాతం రాబడి వృద్ధి సాధిస్తే ఆంధ్రప్రదేశ్‌లో రెండు శాతం కూడా సాధించలేక పోయామన్నారు. ఈ రంగంలో ఏపీకి రాబడి పెరిగేలా చేయూత నందించాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. ‘స్వయం కృషితో నాలుగేళ్లలో ఆదాయాన్ని పెంచుకున్నాం.. దేశంలో రెండంకెల వృద్ధి సాధించిన ఏకైక రాష్ట్ర ఏపీనే.. ఎంత కష్టపడినా రాష్ట్ర నిర్మాణ సమస్యలే ప్రతిబంధకాలుగా మారుతున్నాయి’ అని ఆవేదన వ్యక్తంచేశారు. అవసరమైన సహాయాన్ని, నెరవేర్చాల్సిన హామీలను కేంద్రం అమలు చేయలేదని ఆరోపించారు. వ్యవసాయంలో గణనీయమైన అభివృద్ధిని సాధించామన్నారు. అయినా పారిశ్రామిక, సేవా రంగంలో వెనుకంజలో ఉన్నామని తెలిపారు. వీటన్నింటినీ పరిష్కరించాల్సిన కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. రాష్ట్రంలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని పునరుద్ఘాటించారు. కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పురోగతికి బాటలు వేయాల్సిన బాధ్యత 15వ ఆర్థిక సంఘంపై ఉందని కేంద్రం తప్పులకు రాష్టజ్ర ప్రజలను నష్టపరచటం సమంజసం కాదన్నారు. హైదరాబాద్ స్థాయి నగరం నిర్మించాలంటే 20 ఏళ్లు పడుతుందని అప్పుడే చెప్పామని గుర్తుచేశారు. కేంద్ర పన్నుల్లో వాటాల పంపిణీకి 2011 జనాభా ప్రామాణికంగా తీసుకోవటం సరైందికాదని, 1971ను పరిగణనలోకి తీసుకునే విధంగా ఆర్థిక సంఘంపై ఒత్తిడి తేవాలన్నారు.
సమావేశంలో రెవెన్యూ లోటు గ్రాంటు, వర్టికల్, హారిజాంటల్ డివల్యూషన్ తదితర అంశాల్లో రాష్ట్ర పరిస్థితి, పొరుగు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతుల గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అక్టోబర్ 9,10,11 తేదీల్లో ఆర్థిక సంఘం ప్రతినిధులు రాష్ట్ర పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఆర్థికశాఖ కార్యదర్శి రవిచంద్ర, సీఎంఒ ప్రత్యేక కార్యదర్శి సాయిప్రసాద్, అదనపు కార్యదర్శి రాజవౌళి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.