రాష్ట్రీయం

నినాదాల హోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వరుసగా రెండోరోజు శనివారం కూడా రోజా అంశంపై అట్టుడికిపోయింది. సభ ప్రారంభంనుండి వైకాపా ఎమ్మెల్యేలు ‘ఉయ్ వాంట్ జస్టిస్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగుతుండగానే వైకాపా సభ్యులు పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. దాంతో సభను అదుపులోకి తెచ్చేందుకు రెండుమార్లు వాయిదా వేసిన స్పీకర్ చివరికి సభ అదుపులోకి రాకపోవడంతో సోమవారానికి వాయిదా వేశారు. సాక్షాత్తు హైకోర్టు చెప్పినా కూడా తనను అనుమతించకపోవడంతో రోజా మండుటెండలోనే వౌనదీక్ష చేసి అస్వస్థతకు గురయ్యారు. తీవ్రంగా నీరసించినా ఆమె పడుకుని నిరసన కొనసాగించారు. చివరికి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో 108 అంబులెన్స్‌లో ఆమెను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిమ్స్ ఆస్పత్రిలో రోజాకు ప్రాథమిక చికిత్సను అందజేసిన అనంతరం వైద్యులు ఆమెను పంపించివేశారని తెలిసింది.
నాటకీయ పరిణామాలు
సభా హక్కుల కమిటీ శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు అత్యవసరంగా సమావేశం కాబోతున్నట్టు ముందు రోజు ప్రకటించారు. ఆ మేరకు రోజాకు, వైకాపా ఎమ్మెల్యేలకు కూడా హాజరుకావల్సిందిగా నోటీసులు అందించారు. ఈ క్రమంలోనే రోజా సొమ్మసిల్లిపోవడం, ఆమె కమిటీ ముందు హాజరుకాలేరని, మరికొంత గడువు కావాలని కోరుతూ వైకాపా నేతలు స్పీకర్ కార్యదర్శికి లేఖ అందజేయడం చకచకా జరిగిపోయాయి. కమిటీ మాత్రం రోజా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది.