రాష్ట్రీయం

తీరం దాటిన తుపాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ‘ఉత్తర’ ఏజెన్సీలో భారీ వర్షాలు * నేడు కోస్తా, తెలంగాణలో చెదురుమదురు వానలు
విశాఖపట్నం, సెప్టెంబర్ 21: ‘దయె’ తుపాను గురువారం అర్థరాత్రి ఒడిశాలోని గోపాలపూర్ దగ్గర తీరం దాటింది. ఈ తుపాను బలహీనపడి తూర్పు విదర్భకు దగ్గరలోని గోండియా వద్ద స్థిరంగా కొనసాగుతున్నట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. శనివారం సాయంత్రానికి ఈ వాయుగుండం మరింత బలహీనపడి అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావం వలన ఉత్తర కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో చెదురుమదురు జల్లులు పడే అవకాశం ఉంది. ఏపీలోని అన్ని పోర్టులో ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించారు. మత్స్యకారులు శనివారం మధ్యాహ్నం తరువాత వేటకు వెళ్లవచ్చని చెప్పారు. కాగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ సీలేరులో 16 సెంటీమీటర్లు, పశ్చిమ గోదావరి జిల్లా చింతూరలో 10 సెంటీ మీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అలాగే బొబ్బిలిలో 8, పాతపట్నం, కూనవరంలో ఏడు సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఉత్తరాంధ్రలో చాలా చోట్ల మూడు నుంచి ఆరు సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతాలు నమోదైనాయి.
ఇదిలా ఉండగా ఒడిశాలోని జోలాపుట్ రిజర్వాయర్ నుంచి బలిమెలకు ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. డొంకరాయి నుంచి గోదావరిలోకి గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం ఉదయం 11 గంటల వరకూ 67 వేల క్యూసెక్యుల నీటిని విడుదల చేశారు. కాగా సీలేరు జలాశయం నిండు కుండలా మారింది. సీలేరు జలాశయం కెపాసిటీ 1359 అడుగులు కాగా, శుక్రవారం రాత్రికి ఇన్‌ఫ్లో పెరిగి 1356 అడుగులకు చేరుకుంది. దీంతో శుక్రవారం అర్థరాత్రికి సీలేరు రిజర్వాయర్ గేట్లు తెరిచే అవకాశం ఉంది.