రాష్ట్రీయం

వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 21: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీవారి పుష్కరణి పుణ్యస్నానాలు ఆచరించారు. అంతకుముందు తెల్లవారు జామున 5 నుంచి 7.30 గంటల వరకు స్వామి వారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 7.30 నుంచి 10 గంటల మధ్య శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖమండపంలో శ్రీదేవి, భూదేవీ సమేత శ్రీమలయప్ప స్వామి వారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మవిధి, సహస్రధార, కుంభధారలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పంచ సూక్తాలు, దివ్యప్రబంధాన్ని టీటీడీ వేదపారాయణదారులు,జీయర్లు పారాయణం చేశారు. ఈ వేడుకల్లో ఒక్కో క్రతువులో ఒక్కోరకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. తొమ్మిది రోజుల ఉత్సవాల్లో జరిగిన అన్ని సేవలూ సఫలమై, లోకం క్షేమంగా ఉండడానికి, భక్తులు సుఖశాంతుల్తో ఉండడానికి చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక యజ్ఞాంతంలో అవభృధస్నానం చేస్తారు. యజ్ఞ నిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి,అన్ని సంపూర్ణ ఫలాలు చేకూరడం కోసం చేసే దీక్షాంతస్నానం అవభృథం. రాత్రి 9 నుంచి 10గంటల మధ్య ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈకార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈ ఓ అనిల్‌కుమార్ సింఘాల్, ధర్మకర్తల మండలి సభ్యులు సుధా నారాయణమూర్తి, శివాజీ, శ్రీకృష్ణ, జే ఈ ఓ శ్రీనివాసరాజు, ఇన్చార్జ్ సీవీ ఎస్వో శివకుమార్ రెడ్డి, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.