రాష్ట్రీయం

త్వరలో చంద్రుడిపైకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: చంద్రుడిపై కాలుమోపి తీరుతామని ఇస్రో సంస్థ చైర్మన్ డాక్టర్ కే శివన్ ప్రకటించారు. శనివారం గీతం విశ్వవిద్యాలయం నిర్వహించిన 9వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కే శివన్ మాట్లాడుతూ చంద్రుడిపై కాలుమోపే ప్రయత్నంలో ప్రపంచవ్యాప్తంగా 50 శాతం వైఫల్యాలు నమోదైనా వచ్చే ఏడాది మన దేశం తరఫున భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ్ధ మిషన్ చంద్రయాన్ -2ను ప్రయోగించి విజయవంతం చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతరిక్ష పరిశోధనలో అగ్రస్థానంలో నిలవాలంటే వినూత్న మార్గాలను అనే్వషించడంతో పాటు కష్టనష్టాలు ఎన్నైనా ఎదుర్కొని ముందుకు సాగక తప్పదని ఆయన స్పష్టం చేశారు. మిషన్
చంద్రయాన్ -2 ద్వారా ముందెవ్వరూ పాదం మోపని ప్రాంతంలో ముఖ్యంగా 70 డిగ్రీల అక్షాంశం వద్ద కీలక ప్రాంతాన్ని ఎంచుకున్నామని అన్నారు. దీంతో పాటు వచ్చే ఏడాది మధ్యలో ప్రపంచంలోనే అత్యంత చౌక ధరకే ఉపగ్రహ వాహక నౌక ఎస్‌ఎస్‌ఎల్వీని రూపొందించే ప్రయత్నంలో ఉన్నామని ఆయన తెలిపారు. అతితక్కువ సమయంలో అతితక్కువ వ్యయానికే దీనిని అందుబాటులోకి తెచ్చే సాంకేతిక సామర్థ్యాలను సంతరించుకుంటున్నామని అన్నారు. సాధారణంగా 70 రోజుల సమయం తీసుకునే ఉపగ్రహ వాహక నౌకల తయారీ స్థానంలో కేవలం 72 గంటలలోనే ఆరుగురు శాస్తవ్రేత్తలు ల్యాప్‌టాప్ సాయంతో వాహక నౌకను రూపొందించి అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారని వెల్లడించారు.
ఇంటర్‌నెట్ వాడకంలో ప్రపంచంలో భారత్ రెండోస్థానంలో ఉన్నా బ్రాడ్ బ్యాండ్ వేగం పరంగా 76వ స్థానంలో ఉంతదని, దీనిని సమూలంగా మార్చి 100 జీబీపీఎస్ వేగాన్ని దేశం అంతటా అందించడానికి ఇస్రో తరఫున జీ శాట్ -11, జీ శాట్ -29, జీ శాట్ -20 ఉపగ్రహాలను ప్రయోగించనున్నామని వెల్లడించారు. అంతరిక్ష ప్రయోగాల్లో విజయాలతో పాటు వైఫల్యాలు ఉన్నా, వాటి నుండి కొత్త పాఠాలు నేర్చుకుంటున్నామని దాని ఫలితంగానే ప్రపంచంలోనే రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం తయారీలో భారత్ మొదటిస్థానంలో ఉందని చెప్పారు. రానున్న నాలుగేళ్లలో దాదాపు 50 వాహక నౌకలను ఇస్రో అంతరిక్షంలోకి పంపిస్తుందని, వీటిలో 30 పీఎస్‌ఎల్‌వీ, 10 జీఎస్‌ఎల్వీ, ఎంకే -3లు ఉన్నాయని వెల్లడించారు. వీటికి గానూ భారత ప్రభుత్వం 10,900 కోట్ల రూపాయిలు కేటాయించిందని వెల్లడించారు.
ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల దిగుమతిపై అధికంగా ఆధారపడటం దేశ ఆర్ధిక రంగం పై ప్రతికూల ప్రభావం చూపుతోందని, ముఖ్యంగా రూపాయి విలువ క్షీణించడానికి కూడా కారణం అవుతోందని ఆయన చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏవియేషన్ రంగంలో దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఉన్న అన్ని మార్గాలనూ అనే్వషిస్తున్నామని అన్నారు. దేశంలోని విద్యాలయాలను , పరిశ్రమలను అంతరిక్ష పరిశోధనలో భాగస్వామ్యులను చేయడానికి ఇస్రో తరఫున అన్ని ప్రాంతాల్లో స్పేస్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్లను నెలకోల్పనున్నామని అన్నారు. వీటిని ఇస్రోలోని కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం ఆఫీసు ద్వారా పర్యవేక్షిస్తామని చెప్పారు.
అంతకు ముందు గీతం కులపతి ప్రొఫెసర్ కే రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ కే శివన్‌కు గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు. అలాగే ప్రముఖ శిల్పాచార్యుడు , తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం రూపశిల్పి డాక్టర్ ఎక్కా యాదగిరిరావుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. గీతం ఉప కులపతి ప్రొఫెసర్ ఎం ఎస్ ప్రసాదరావు వార్షిక నివేదిక సమర్పించారు. స్నాతకోత్సవంలో 1017 మందికి బిటెక్, ఎంటెక్, ఎంబీఏ పట్టాలను ప్రదానం చేశారు. ముగ్గురికి పీహెచ్‌డీ పట్టాలు ఇచ్చారు.

చిత్రం..ఇస్రో చైర్మన్ శివన్‌కు గౌరవ డాక్టరేట్‌ను అందజేస్తున్న గీతం కులపతి ప్రొఫెసర్ రామకృష్ణారావు