రాష్ట్రీయం

ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 22: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని లాలాచెరువు ప్రాంతం శుక్రవారం అర్ధరాత్రి భారీ పేలుళ్లతో ఉలిక్కిపడింది. జనావాసాల మధ్య అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్న ఒక తాటాకు ఇంట్లో ఒక్క సారిగా పేలుడు సంభవించడంతో స్థానికులు ఇళ్ళల్లోంచి పరుగులు తీసారు. ఏమి జరిగిందో గ్రహించేలోపే, విస్పోటనంలో ముగ్గురు మాడిపోయారు. మృతి చెందిన ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జనావాసాల మధ్య అద్దెకు తీసుకున్న మట్టిగోడల తాటాకు ఇంట్లో దేవాడ ముత్యాల రెడ్డి కుటుంబం దీపావళి బాణాసంచా తయారు చేస్తోంది. ఎటువంటి లైసెన్స్ లేకుండా 20 ఏళ్లనుంచి ఈ కుటుంబం నార పురికోస చుట్టే బాంబులు తయారు చేయడమే వృత్తిగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. శనివారం అర్ధరాత్రి సమయంలో బాంబులు తయారు చేస్తుండగా ప్రమాదం సంభవించింది. దీంతో ముత్యాలరెడ్డి భార్య సూర్యకాంతం, కోడలు ధనలక్ష్మి, చిన్న కొడుకు వినయ్‌రెడ్డి మృతి చెందారు. ముత్యాలరెడ్డి, అతని పెద్ద కొడుకు దుర్గారెడ్డి, మేనకోడలు వైష్ణవి తీవ్ర గాయాలు పాలయ్యారు. వీరిలో మేనకోడలను మెరుగైన వైద్యంకోసం స్థానిక జీఎస్‌ఎల్ ఆసుపత్రికి తరలించారు. పెద్ద కొడుకు దుర్గారెడ్డికి కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స జరుగుతున్నది. ముత్యాల రెడ్డి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆటో నడుపుతూ జీవించే ముత్యాలరెడ్డి బాణాసంచా తయారు చేయడం ప్రవృత్తిగా పెట్టుకున్నాడు. పేలుడు ధాటికి పరిసర కాంక్రీటు భవనాలు, ప్రహరీలు బీటలు వారాయి. కిటికీలు, అద్దాలు పగిలిపోయాయి. తాటిచెట్టంత ఎత్తులో శిథిల శకలాలు ఎగసిపడ్డాయి. స్థానికులు భయకంపితులై ఇళ్లల్లోంచి పరుగులు తీశారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ఏమాత్రం క్షణం ఆలస్యం చేయకుండా బాధితులను ఆసుపత్రికి తరలించడం వల్లే మృతుల సంఖ్య ముగ్గురితో ఆగిందని స్థానికులు చెప్పారు. అగ్నిమాపక దళం అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసింది. ప్రమాద ప్రాంతానికి అర్బన్ ఎస్పీ షిమోషీ చేరుకుని విచారణ జరిపారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆకుల సత్యనారాయణ, గుడా ఛైర్మన్ గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు ప్రమాద ప్రాంతాన్ని సందర్శించారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించి పరిస్థితి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఘటనపై విచారణకు ఆదేశించారు.

చిత్రం..బాణాసంచా పేలడంతో ఎగసిపడుతున్న మంటలు