రాష్ట్రీయం

కిక్కిరిసిన బారాషహీద్ దర్గా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: నెల్లూరు జిల్లా కేంద్రంలోని బారాషహీద్ దర్గా ప్రాంగణం రొట్టెల పండుగతో భక్తజనంతో పోటెత్తుతోంది. లక్షల సంఖ్యలో వస్తున్న భక్తులతో దర్గా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సమీపంలోని స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్పిడి చేసుకొని, బారాషహీద్ దర్గాలో అమరవీరుల సమాధులను దర్శనం చేసుకొనేందుకు వివిధ రాష్ట్రాలతో పాటు సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, ఇండోనేషియా తదితర దేశాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. శనివారం అర్ధరాత్రి కడప దర్గా పీఠాధిపతుల ఆధ్వర్యంలో గంధ మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ గంధోత్సవాన్ని వీక్షించేందుకు రొట్టెల పండుగకు వచ్చిన భక్తులు దర్గా పరిసరాల్లో వంటావార్పు చేసుకొని ప్రత్యేకంగా గుడారాలు వేసుకొని సేదదీరుతున్నారు. ఈ ఏడాది సంతానం, ఉద్యోగం, విద్య రొట్టెలకు డిమాండ్ ఏర్పడింది. పెళ్లి
రొట్టెలను కూడా పలువురు పట్టుకొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ దర్గా పరిసరాలల్లోనే ఉంటూ భక్తులకు అందుతున్న సౌకర్యాలను, ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారు. శుక్రవారం నుండి ప్రారంభమైన ఈ రొట్టెల పండుగకు ఇప్పటివరకు సుమారు నాలుగు లక్షల మంది వరకు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో మూడు రోజులపాటు ఈ పండుగ జరగనుండటంతో భక్తుల తాకిడి పది లక్షలకు మించి ఉంటుందనే అంచనాలతో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు సినీనటుడు పవన్ కళ్యాణ్ ఆదివారం బారాషహీద్ దర్గాకు వస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

చిత్రం..రొట్టెల పండగకు వచ్చిన భక్తులతో కిక్కిరిసిన నెల్లూరు స్వర్ణాల చెరువు ప్రాంగణం