రాష్ట్రీయం

నవ్యత లేని వైకాపా నవరత్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వైకాపా 2019లో అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటున్న నవరత్న పథకాలలో ఏ మాత్రం నవ్యత లేదని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్. తులసీరెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఆంధ్రరత్నభవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు భరోసా, ఆసరా, పింఛన్లు, పేదలకు ఇళ్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, దశలవారీగా మద్య నిషేధం ఇది వైకాపా డబ్బాకొట్టుకుంటున్న నవరత్న పథకాలన్నారు. ఇందులో దాదాపు అన్ని పథకాలు 2004 - 2014 మధ్య కాలంలో కాంగ్రెస్ పాలనలో అమలైనవే, కొన్ని ప్రస్తుతం కూడా అమలవుతున్నాయని తులసీరెడ్డి అన్నారు. రైతు భరోసా కింద 5 ఎకరాల లోపు చిన్న, సన్నకారు రైతులందరికీ రూ. 50 వేలు ఇస్తామని, ఏటా మేలో నాలుగు ఏళ్ల పాటు రూ. 12,500 కోట్లు ఇస్తామని వైకాపా ప్రకటించిందన్నారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే షరతులు లేకుండా పరిమితి విధించకుండా ఒకేసారి వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని ఏపీసీసీ 84వ ప్లీనరీలో, సీడబ్ల్యుసీ సమావేశంలో తీర్మానం చేయడమే కాకుండా కర్నూలు సభలో రాహుల్‌గాంధీ స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. మాట తప్పడం జగన్ స్థిరాస్తి అన్నారు.