రాష్ట్రీయం

న్యాయమే దైవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వ్యక్తిగతంగా, సమాజపరంగా, హక్కులపరంగా అన్యాయం జరిగినప్పుడు చివరగా ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తారని, వారి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా న్యాయం జరిగేలా చూసే గురుతర బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉందని సిఎం కె చంద్రశేఖర్‌రావు సూచించారు. హైదరాబాద్‌లో రెండు రోజులపాటు జరగునున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల న్యాయాధికారుల సదస్సు శనివారం స్థానిక మారియట్ హోటల్లో ప్రారంభమైంది. సదస్సు ప్రారంభోత్సవానికి రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కె చంద్రశేఖర్‌రావు, ఎన్ చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. సదస్సులో ఆంధ్ర సిఎం చంద్రబాబు మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించుకోవడం ద్వారా పెండింగ్ కేసులు తగ్గించవచ్చన్నారు. తమ రాష్ట్రంలో న్యాయవ్యవస్థను పూర్తిగా డిజిటలైజేషన్ చేయబోతున్నట్టు చెప్పారు. కొత్త రాజధాని అమరావతిలో ప్రపంచస్థాయిలో హైకోర్టును నిర్మించబోతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. కక్షిదారులు తమ కేసుల పురోగతిని, తీర్పులను ఆన్‌లైన్‌లోనే తెలుసుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు. సత్వర న్యాయం జరిగినప్పడే న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని చంద్రబాబు అన్నారు. సదస్సులో తెలంగాణ సిఎం కెసిఆర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినంత సులువుగా ప్రజలు న్యాయస్థానాల గడప తొక్కరని, దేవాలయానికి వెళ్లినంత పవిత్రభావంతో వస్తారన్నారు. అలాంటివారికి సత్వర న్యాయం అందించి వ్యవస్థపై నమ్మకాన్ని మరింత బలపర్చేందుకు న్యాయాధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజాస్వామ్యానికి జ్యుడీషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటీవ్ ఈ మూడు మూల స్తంభాలని, మూడూ సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం మరింత పరిఢవిల్లుతుందని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. మునుపటికంటే న్యాయస్థానాల్లో కేసులు సత్వర పరిష్కారానికి నోచుకుంటున్నా, ఇంకా లక్షలాది కేసులు పెండింగ్‌లో మగ్గుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కింది కోర్టుల్లో ఐదు లక్షల కేసులు పెండింగ్‌లో ఉండగా, ఉమ్మడి హైకోర్టులో 2.72 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కోర్టులో కేసుల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేసి ఇరు రాష్ట్రాల ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సదస్సులో న్యాయాధికారులు చర్చించాలని కోరారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జస్టిస్ అనిల్ ఆర్ దరే మాట్లాడుతూ న్యాయమూర్తులు ఆత్మసాక్షితో వ్యవహరించాలన్నారు. న్యాయమూర్తి న్యాయం చేయకపోతే ఆ భగవంతుడు తప్పకుండా న్యాయం చేస్తారని, అందుకే న్యాయమూర్తులు భగవంతుని ప్రతినిధిగా విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా మాట్లాడుతూ న్యాయస్థానాలు ప్రజలకు, న్యాయవ్యవస్థకు జవాబుతానంగా ఉండాలన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ మాట్లాడుతూ భారత న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపారమైన విశ్వాసం ఉందన్నారు. కోర్టులో కేసులు పేరుకుపోవడానికి క్షేత్రస్థాయి కారణాలను విశే్లషించుకొని వాటి పరిష్కారాలకు మార్గాలు ఆనే్వషించాలని సూచించారు. న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించుకోవడం ద్వారా పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించవచ్చని అన్నారు. సదస్సుకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బొంస్లే అధ్యక్షత వహించగా, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ సుభాష్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య తదితరులు సదస్సులో మాట్లాడారు.

చిత్రం... తెలుగు రాష్ట్రాల న్యాయాధికారుల సదస్సులో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న
సిఎం చంద్రబాబు. చిత్రంలో జస్టిస్ దిలీప్ బోంస్లే, తెలంగాణ సిఎం కెసిఆర్,
జస్టిస్ అనిల్ ఆర్ దావే, జస్టిస్ దీపక్ మిశ్రా తదితరులు