రాష్ట్రీయం

‘మహా’ అయితే 10 సీట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముస్తాబాద్, సెప్టెంబర్ 22: కాంగ్రెస్ శుష్క హామీలు, ప్రతిపక్ష పార్టీల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని తెలంగాణ ప్రజలకు ఐటీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. గత 60ఏళ్లలో జరగని అభివృద్ధి తెలంగాణ వచ్చాక జరిగిందని, టీఆర్‌ఎస్‌ను మరొకసారి గెలిపిస్తే ఇప్పటికన్నా మూడింతలు అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేసీఆర్ ఉద్యమం లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 10సీట్లు మాత్రమే గెలుస్తుందని తారక రామారావు జోస్యం చెప్పారు. ఈ విషయం ఉత్తమ్‌కమార్‌కూ తెలుసని ఆయన తెలిపారు. తాను నేతన్న కుటుంబంలో పుట్టక పోయినా సిరిసిల్లలో చేనేత కార్మికుల ఆత్మహత్యల్ని ఆపడానికి, శాశ్వత పరిష్కారం దిశగా వారికి నెలసరి ఆదాయం పెంచడానికి 300కోట్లతో బతుకమ్మ చీరల్ని అర్డర్ చేసినట్లుగా వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో శనివారం నిర్వహించిన టీఆర్‌ఎస్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు, రాష్టస్థ్రాయి ఇంజినీరింగ్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్ని నియోజకవర్గంలోని అన్ని మండలాలకు మంజూరు చేస్తామని మంత్రి
హామీ ఇచ్చారు. మధ్య మానేరు ప్రాజెక్టు నుంచి ఏడాదిలోగా ఎగువమానేరు ఎత్తిపోతలు సంపూర్తిచేసి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. మూడేళ్లలో హైదరాబాద్-సిరిసిల్లకు రైలు మార్గాన్ని పూర్తిచేసి రైలు వచ్చేలా చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో 100 మంది ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్ గెలిపించుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పడానికి 13మంది ఎంపీల్ని గెలిపిస్తే టీఆర్‌ఎస్‌కే హవా అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక, ఆదర్శవంతంగా అభివృద్ధి జరిగిందని మంత్రి స్పష్టం చేశారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధికి ఇప్పడు జరిగిన అభివృద్ధితో పొల్చుకుంటే రాష్ట్రం అన్నిరంగాల్లో గణనీయ అభివృద్ధి సాధించిందని చెప్పారు. కాంగ్రెస్ ఇస్తున్న ఎన్నికల హామీలు నెరవేర్చడం సాధ్య పడదన్నారు. దక్షిణ భారతదేశంలోని ఆరు రాష్ట్రాల బడ్జెట్ మొత్తాన్ని సమకూర్చిన టీపీసీసీపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్తోన్న హామీలను నెరవేర్చడం అసాధ్యమన్నారు. కాళేశ్వరం తదితర ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వవద్దని కేంద్రానికి లేఖలు రాసిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, ఇక్కడి కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకొని ఏం సాధిస్తారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, పలుసంక్షేమ పథకాలతో తెలంగాణ పల్లెపల్లెన ప్రయోజనం పొందిన లబ్ధిదారులున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజల చిరునవ్వు మోహాల్లో కేసీఆరే కన్పిస్తున్నారని స్పష్టం చేశారు. 10జిల్లాలను పాలనా సౌలభ్యం కోసం 31జిల్లాలుగా ఏర్పాటు చేశామన్నారు. 4వేల మారుమూల పల్లెలు, తండాల్ని గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయడంతో ప్రజానీకం జేజేలు పలుకుతున్నారని అన్నారు. విపక్షాలన్నీ మహాకూటమి పేరుతో ముందుకొస్తున్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్ పాత్రలేదని కాంగ్రెస్ నేత గులాంనబి ఆజాద్ వ్యాఖ్యనించడం తగదన్నారు. నియోజకవర్గంలో అన్నిగ్రామాలకు తారురోడ్లు, సీసీ రోడ్లు, వంతెనల నిర్మాణం జరిగిందన్నారు. మిషన్ భగీరథతో అత్యధిక గ్రామాల్లో ఇంటింటికి నల్లానీరు, రైతుకు 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా సక్సెస్ జరిగిందన్నారు. గంభీరావుపేట జడ్పీటీసీ మల్లుగారి నర్సాగౌడ్, కార్యకర్తల్ని గుర్తించడం లేదని, తగిన ప్రధాన్యత లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేయగా, కేటీఆర్ స్పందిస్తూ ‘కార్యకర్తల్లో ఎంతకొంత అసంతృప్తి ఉండటం సహజం. వారికి రానున్న రోజుల్లో తగిన ప్రధాన్యత, గుర్తింపు అందుతుంది’అన్నారు. రాజకీయ బిక్ష ప్రసాధించిన సిరిసిల్ల నియోజకవర్గం తనకు కన్నతల్లి వంటిదని, ఇక్కడి నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. హైదరాబాద్‌లో పోటీ చేస్తానని కొందరు ప్రచారం చేస్తున్న దాంట్లో వాస్తవం లేదని చెప్పారు. ఎంపీ వినోద్‌కుమార్, జిల్లా ఇంచార్జీ, ఎమ్మెల్సీ భానుప్రసాద్, మాజీమంత్రి సారయ్య, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీంధర్‌రావు, సిరిసిల్ల మున్సిపాల్ చైర్‌పర్సన్ పావని తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ఎల్లారెడ్డిపేటలో టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్