రాష్ట్రీయం

కాంగ్రెస్ ‘పీపుల్స్ మేనిఫెస్టో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం, హామీ ఇచ్చామంటే అమలు చేస్తుందన్న విశ్వాసం ప్రజలకు కలిగించాలని టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో) కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహా అధ్యక్షతన సమావేశమై వివిధ హామీలపై సుదీర్ఘంగా చర్చించింది. పార్టీ మేనిఫెస్టోను ‘పీపుల్స్ మేనిఫెస్టో’గా పేర్కొనాలని ఈ సందర్భంగా నిర్ణయించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సీ కుంతియా, ఉతమ్‌కుమార్ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఉత్తమ్ మాట్లాడుతూ ఆర్థికంగా, సాంకేతికంగా, న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా అమలు చేసేందుకు అవకాశం ఉన్న హామీలనే ఇవ్వాలన్నారు. ఆ నమ్మకాన్ని కాంగ్రెస్ లోగడ కూడా నిలబెట్టుకున్నదని ఆయన గుర్తు చేశారు. పార్టీ తరఫున ఇచ్చే హామీలన్నీ చాలా ప్రధానమైనవని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళడమూ చాలా కీలకమని అన్నారు. ఇప్పటికే తాము కొన్ని సామీలను ప్రజలకు ఇవ్వడం జరిగిందని, వాటిని కమిటీ ఆమోదించి ప్రణాళికలో పేర్కొనాలని ఆయన సూచించారు.
మ్యానిపెస్టొలో చేర్చనున్న హామీలు..
* రైతులకు రెండు లక్షల రుణ మాఫీ
* అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రూపాయల రుణ మాఫీ ఏకకాలంలో చేయడం
* 17 రకాల వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం
* నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి
* అర్హులందరికీ పెన్షన్లు
* ఎస్‌సి, ఎస్‌టీలకు ఉచితంగా సన్న బియ్యం
* 7 నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ళు
* దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఏడాదికి 6 సిలెండర్లు
* కొత్త ఇళ్ళకు రూ.5 లక్షలు చొప్పున మంజూరు చేయడం
* మహిళా సంఘాలకు లక్ష రూపాయల గ్రాంట్ ఇవ్వడం.
చిత్రం..కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో) కమిటీ సమావేశానికి హాజరైన కుంతియా,
ఉత్తమ్, రాజనర్సింహ తదితరులు