రాష్ట్రీయం

ఓటర్ల సవరణ బోగస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) ప్రచారం చేస్తున్న విధంగా ఓటర్ల జాబితా సవరణ జరగడం లేదని వాస్తవ పరిస్థితి వెల్లడిస్తోంది. క్షేత్రస్థాయి అధికారులు ఓటర్ల జాబితా సవరణ గురించి పట్టించుకోవడమే లేదు. తహశీల్ కార్యాలయాల్లో ఎన్నికల పేరుతో సిబ్బంది సొంత పనులపై వెళ్లిపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల క్రితం సీఈఓ చెప్పిన వివరాల ప్రకారం 18 లక్షల మంది యువత తమ పేర్లను నమోదు చేయించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారే ఇందులో అత్యధికంగా ఉన్నారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓ) దాదాపు ఎక్కడా ఉండటం లేదు. తహశీల్దారులు, డిప్యూటీ తహశీల్దారుల్లో ఎవరైన శ్రద్ధ తీసుకుంటే తప్ప పని జరగడం లేదు. ఇదంతా చూస్తుంటే జాబితా సవరణ కంటితుడుపుగా జరుగుతోందని స్పష్టమవుతోంది. సవరణకు మరో మూడు రోజులే గడువు ఉండటం వల్ల ఈ కార్యక్రమం యుద్ధప్రాతిపదికన జరగాల్సి ఉన్నప్పటికీ ఆ ఛాయలే కనిపించడం లేదు. రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట గ్రామంలో పోలింగ్ కేంద్రాలు ఉండే ఉన్నత పాఠశాలల్లో బీఎల్‌ఓలు ఎవరూ అందుబాటులో లేరు. ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డిని ప్రశ్నిస్తే ‘తహశీల్దారును అడగండి’ అన్న సమాధానం. సంబంధిత వీఆర్‌ఓ రఘుపతిని ఫోన్‌లో ప్రశ్నిస్తే..అసలు ఓటర్ల జాబితాతో తనకేమీ సంబంధం లేదని, పైగా తమ మండలంలో ఈ పని చేయడం లేదని అన్నారు. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బాలాపూర్ తహశీల్దారు కార్యాలయానికి ఈ ప్రతినిధి వెళితే తహశీల్దారు, డిప్యూటీ తహశీల్దారు, సిబ్బంది ఎవరూ అందుబాటులో లేదు. వీరి సీట్లు ఖాళీగా ఉన్నాయి. రిసెప్షనిస్టును అడిగితే తనకేమీ తెలియదని సమాధానం. పేర్లు, ఇంటి నెంబర్ తదితర అంశాల్లో సవరణ చేయించుకునేందుకు వచ్చే ఓటర్లు నిరాశతో వెళ్లిపోవాల్సి వస్తోంది. తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్లకు అధికారికంగా మొబైల్ ఫోన్లను ప్రభుత్వం ఇచ్చినప్పటికీ, వారి నెంబర్లు కార్యాలయంలో అందుబాటులో ఉంచలేదు. ఈ పరిస్థితి
ఒక్క బాలాపూర్ మండలంలోనే కాదు రాష్ట్రంలోని చాలా మండలాల్లో నెలకొని ఉంది.
మాదన్నపేట కాలనీవాసుల దిగ్భ్రాంతి
మాదన్నపేట కాలనీ ఓటర్లు దిగ్భ్రాంతికి గురయ్యేలా అధికారులు వ్యవహారించారు. కొన్ని సంవత్సరాలుగా కాలనీ ఓటర్లు తమ కాలనీలోనే ఉన్న క్రిస్టాస్ ప్రైవేటు పాఠశాలలో ఉండే పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకునే వారు. కాగా ఆ పాఠశాల మూతపడడంతో కాలనీకి పక్కనే ఉన్న మాదన్నపేటలోని జావెద్ పబ్లిక్ స్కూలుకు పోలింగ్ కేంద్రానికి మార్చడం జరిగింది. ఇప్పుడు ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే మొత్తం కాలనీ ఓట్లన్నీ కిలో మీటరు దూరంలో ఉన్న (మాదన్నపేట మార్కెట్ వెనుక) ప్రభుత్వ బాలుర పాఠశాలకు పోలింగ్ కేంద్రాన్ని మార్చారు. ఇదేమిటీ అని అడిగితే ‘జంబ్లింగ్’ పద్ధతి అని జీహెచ్‌ఎంసీ ఉద్యోగి ఒకరు చల్లగా చెప్పారు. ఎందుకు మార్చారో తెలుసుకోవాలనుకుంటే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను సంప్రదించాలన్నారు. అసలే ఓటింగ్ శాతం అంతంత మాత్రంగానే ఉందంటే, కిలో మీటరు దూరానికి పోలింగ్ కేంద్రం మార్చడం ఏమిటని కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు ఎవరు జవాబు చెబుతారు.
తప్పుచేస్తే శిక్ష ఉండదా?
ఓటర్ల జాబితాలో జరిగే తప్పులకు ఎవరినీ బాధ్యులను చేయకపోవడం వల్ల మళ్లీ మళ్లీ తప్పులు జరుగుతున్నాయి. ఏడాది క్రితం జాబితాలో ఉన్న పేర్లలో దాదాపు 30 లక్షల పేర్లు గల్లంతు కావడానికి కారణాలపై అధికారికంగా విచారణ జరగలేదు. తప్పు చేసిన ఏ ఒక్కరిపై చర్య తీసుకోలేదు. ఈ కారణంగానే ఇప్పుడు కూడా ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల నిర్ణయం ఒక ప్రహసనంగా మారింది. ఈ పరిస్థితిలో కనీసం 20 లక్షల నుండి 30 లక్షల మంది పేర్లు మళ్లీ కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో ఓటర్ల జాబితా సవరణ గడువును పొడిగించాలని వివిధ జిల్లాల నుండి డిమాండ్ వస్తోంది.
చిత్రాలు.. ..వెలవెలబోతున్న బాలాపూర్ తహశీల్దార్, సిబ్బంది కార్యాలయాలు