రాష్ట్రీయం

పోలవరం, రంపచోడవరం పరిధిలోకి విలీన మండలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 22: రాష్ట్రంలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీలో కలిపిన సంగతి విదితమే. కాగా ఆయా మండల గ్రామాలను ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని రంపచోడవరం, పోలవరం శాసనసభ నియోజకవర్గాల్లో కలుపుతూ శనివారం నోటిఫికేషన్ జారీ అయింది. ఇకపై రంపచోడవరం పరిధిలో మారేడుమిల్లి, దేవీపట్నం, వై రామవరం, అడ్డతీగల, గంగవరం, రంపచోడవరం, రాజవొమ్మంగి, కూనవరం, చింతూరు, వీఆర్ పురం మండలాలతో పాటు ఏటపాక మండలంలోని అన్ని గ్రామాలు, భద్రాచలం మండలంలో భద్రాచలం మినహా మిగిలిన గ్రామాలన్నీ కలిపారు. కాగా పోలవరం శాసనసభ నియోజకవర్గం పరిధిలోకి పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, టీ నరసాపురం, వేలేరుపాడు మండలాలతో పాటు కుక్కునూరు మండలం మొత్తం రెవెన్యూ గ్రామాలు సీతారామనగరం, శ్రీ్ధరవేలేర్, గుమ్మనపల్లి, గణపవరం, ఇబ్రహీంపేట్, రావిగూడెం గ్రామాలను కలుపుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.