రాష్ట్రీయం

ప్రమాదంలో మృతి చెందిన యువకుడి అవయవదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 22: మనిషి మరణానంతరం తనతో పాటే శరీరంలోని అవయవాలన్నీ మట్టిలో కలసిపోతాయి. లేదంటే చితిలో కాలి బూడిదవుతాయి. అయితే అవయవ దానం ద్వారా మరణం తర్వాత కూడా జీవించే అవకాశం లభిస్తుంది. అటువంటి మహత్తర కార్యమైన అవయవ దానం ద్వారా పలువురి జీవితాల్లో వెలుగులు నింపారు ఆ యువకుడి తల్లిదండ్రులు. అనుకోని ప్రమాదం కన్నబిడ్డను కబళిస్తే ఆ దుఃఖాన్ని పంటి బిగువున దిగమింగుకుని కుమారుడి అవయవాలను దానం చేయడం ద్వారా పలువురికి పునర్జీవితం ప్రసాదించారు. పశ్చిమ గోదావరి జిల్లా బొమ్మిడి గ్రామానికి చెందిన నాగరాజు రవీంద్ర వర్మ (27) ప్రసాదంపాడులోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తుండేవాడు. గత సోమవారం గన్నవరంలో జరిగిన వినాయక నిమజ్జన ఊరేగింపులో సంభవించిన ప్రమాదంలో రవీంద్ర వర్మ తీవ్రగాయాలపాలయ్యాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రవీంద్రను నగరంలోని కామినేని ఆసుపత్రిలో చేర్పించారు. రవీంద్ర వర్మకు చికిత్స అందించిన ఆసుపత్రి వైద్య బృందం శనివారం రవీంద్ర శర్మ బ్రెయిన్‌డెడ్ అయినట్లు నిర్ధారించారు. విధివశాత్తు ప్రాణాలో కోల్పోయి తమకు శాశ్వతంగా దూరమైన తమ బిడ్డను మృత్యుంజయుడిగా చేయాలని సంకల్పించుకున్న రవీంద్ర వర్మ తల్లిదండ్రులు కుమారుడి అవయవ దానానికి ముందుకొచ్చారు. రవీంద్ర తల్లిదండ్రుల నిర్ణయం మేరకు అవయవదానానికి వైద్యలు సత్వర ఏర్పాట్లు చేశారు. రవీంద్ర వర్మ గుండెను చెన్నైలోని ఫోర్టిస్ ఆసుపత్రికి, కాలేయాన్ని తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి, నేత్రాలను గుంటూరు శంకర కంటి ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. రవీంద్ర వర్మ గుండెను ప్రత్యేక వాహనం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి, అక్కడి నుండి విమానంలో చెన్నైకి పంపించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సీవోవో నరేంద్ర మాట్లాడుతూ తమ బిడ్డ భౌతికంగా తమకు దూరమైన దుఃఖాన్ని దిగమింగుకుని అతడి అవయవదానం ద్వారా అనేక మందికి మార్గనిర్దేశం చేసిన రవీంద్ర వర్మ తల్లిదండ్రులు అభినందనీయులన్నారు. సమావేశంలో రవీంద్ర వర్మకు చికిత్స అందించిన ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ ఎంటీ శ్రీనివాస్, న్యూరో పిజిషియన్ డాక్టర్ వీ నవీన్‌కుమార్, ఇంటెన్సివిస్ట్ డాక్టర్ వినతి పాల్గొన్నారు.