రాష్ట్రీయం

డిజిటల్ డోర్ నెంబర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 22: ప్రకృతి, సాంకేతికతను మిళితం చేస్తే... అభివృద్ధి, అరోగ్యం, వౌలిక సదుపాయాలు మనముందు ఆవిష్కరించు కోవచ్చని అందుకే ఆదిశగా తాను ప్రణాళికలు రూపొందిస్తున్నానని ఇందులో భాగంగానే పుర సేవలను గడప ముందుకు చేర్చేందుకు డిజిటల్ డోర్ నెంబర్లను ఏర్పాటు చేశామని, భారతదేశంలోనే తొలిసారిగా తిరుపతిలో ఈవిధానానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో విప్లవాత్మక సంస్కరణలకు తిరుపతి పుణ్య క్షేత్రాన్ని కేంద్ర బిందువుగా చేసి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. శనివారం రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన డిజిటల్ డోర్ నెంబర్ వ్యవస్థను తిరుపతి నెహ్రూనగర్ వద్ద సీఎం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పచ్చని తిరుపతి - అత్యంత నివాసయోగ్యమైన తిరుపతి అన్ననినాదంతో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఓవైపు సూర్యతాపం ఎక్కువున్నా, విద్యార్థులతో కలిసి దాదాపు ఒక కిలోమీటరు దూరం సీఎం పాదయాత్రగా వచ్చారు. విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని ముందుకు సాగారు. ర్యాలీ ప్రారంభించడానికి ముందు టౌన్‌క్లబ్ సర్కిల్ వద్ద ఉన్న ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. అటు తరువాత పచ్చదనం - పరిశుభ్రత కార్యక్రమంలో విశేష కృషి చేసిన అటవీశాఖ అధికారులకు ఆయన తన చేతులు మీదుగా ప్రశంసా పత్రాలు రజిత, కాంస్య పతకాలను అందించి అభినందించారు. ఈసందర్భంగా సీ ఎం మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో రచనలు, పాటలు, కవితలు వంటి అనేక పోటీల్లో పాల్గొనాలని వాందరికి ప్రశంసాపత్రాలు అందిస్తామని పిలుపునిచ్చారు. పచ్చదనం, పరిశుభ్రతకు కట్టుబడి ఉంటామని సభకు హాజరైన మహిళలు, విద్యార్థులు చేత ప్రతిజ్ఞ చేయించారు. ఇదిలా ఉండగా బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించిన రెండు పర్యాయాలు ఎక్కడా రాజకీయ పరమైన అంశాలు కాని, ప్రతిపక్షాలపైన విమర్శలు కాని చేయకపోవడం గమనార్హం. అయితే 2003లో శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల రెండో ఘాట్ రోడ్డులో అలిపిరి వద్ద నక్సలైట్లు క్లెమోర్ మైన్స్‌తో దాడి చేసినా తనకు ఎలాంటి హానీ కలగకుండా ఆ వేంకటేశ్వరస్వామి పునర్జన్మనిచ్చారని అన్నారు. అది ఈ రాష్ట్రానికి, రాష్ట్రప్రజలకు మేలు చేయడం కోసమే తనను ఆపద నుంచి కాపాడాడని, ప్రజలంతా తనకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. తన పాలనలో స్వచ్ఛత, మీ ఆలోచనల్లో స్వచ్ఛత, పరిసరాల్లో స్వచ్ఛత ఉండాలన్నదే తన సంకల్పమన్నారు. ప్రతి మనిషికి ఆరోగ్యం ముఖ్యమన్నారు. అందుకే తిరుపతి నగరంలో నగరవనం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. తిరుపతి క్షేత్రాన్ని పచ్చదనం మధ్య ఉంచడమే తన సంకల్పమన్నారు. డిజిటల్ డోర్ నెంబర్లను తొలిసారిగా తిరుపతి పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేస్తున్నామని, పుర సేవలు ఇకపై మీ ఇంటి గడప వద్ద ఉంటాయన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరు పౌరసేవల ఆప్‌ను డౌన్‌ల్లోడ్ చేసుకోవాలని, ఈయాప్‌కు క్యూ ఆర్ కోడ్‌ను అనుసంధానం చేయాలన్నారు. దీంతో మీకు ఎలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడినా అక్కడ అంబులెన్స్ కాని, అగ్నిమాపక వాహనాలు కాని ఎంత సమయానికి వచ్చిందో, చెత్తను ఏ సమయంలో పారిశుద్ధ్య కార్మికులు సేకరించారో సెంట్రల్ కమాండ్ కంట్రోల్‌కు చేరుతుందని, తాను స్వయంగా చూడగలుగుతానని అన్నారు. ఇది సాంకేతికత వల్ల ఏర్పడిన సౌకర్యమన్నారు. డిజిటల్ డోర్ ద్వారా మీ ఇంటి చిరునామా కనుక్కోవడం మీ ఇంటికి వచ్చే అతిధులకు ఎంతో సులభమన్నారు. తిరుపతిలో కాలుష్య నివారణ, ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకని నగరవనంను ప్రారంభించామని అన్నారు. రాష్ట్రంలో మొదటి నగరవనంను తిరుపతిలో ప్రారంభించామని, అన్ని పాఠశాలలు,కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పచ్చదనం పెంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రూ.23 కోట్లతో 150 ఎకరాలలో నగరవనం అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇందులోభాగంగ కపిలతీర్థం నుంచి అలిపిరి వరకు ఉడ్ ఫ్లై ఓవర్‌ను, అవసరమైతే అలిపిరి నుంచి జూపార్కు వరకు 10 కిలోమీటర్లు వాకింట్ ట్రాక్ ఏర్పాటు చేయడం ద్వారా ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని చెప్పారు. అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతాల్లో నాల్గవ స్థానంలో ఉన్న తిరుపతి, రానున్నకాలంలో డిజిటల్ డోర్ నెంబరింగ్ విధానం ద్వారా మంచి స్మార్ట్ సీటీ కావాలనే సంకల్పంతో పని చేస్తున్నామన్నారు. పరిశుభ్ర నగరంగా 6వ స్థానంలో, భద్రతాపరంగా రెండో స్థానంలో, పరిశుభ్ర రైల్వే స్టేషన్లలో దేశంలోనే 3వ స్థానంలో తిరుపతి నిలువడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తిరుపతిలో పాకశాస్త్ర విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో శిక్షణ పొందిన వారు నాణ్యమైన వంటకాలను తయారు చేయగలుగుతారని, తద్వారా పర్యాటక శాఖ కూడా అభివృద్ధి చెందుతుందని సీ ఎం చెప్పారు.ఇకపై ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యత పెంచేందుకు తమ ప్రభుత్వ దృష్టి సారిస్తుందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా 5లక్షల ఎకరాలలో 5లక్షల మంది రైతులు సేద్యం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్రిమిసంహారక మందులు ఉపయోగించని వ్యవసాయం చేసే దిశగా రైతులు పంటలు పండిచాలన్నారు. అన్ని గ్రామాలలో మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టడంతోపాటు, ఎల్ ఈ డీ బల్బులను ఏర్పాటు చేశామన్నారు. ఏపీలో గత నాలుగేళ్లలో ఒక్క సెల్‌ఫోన్ కూడా ఉత్పత్తి కాలేదని అయితే ఆంధ్ర రాష్ట్రంలో 30శాతం సెల్‌ఫోన్లు తయారు చేసే స్థితికి ఎదిగామన్నారు. ఇందుకు శ్రీసిటీ వేదిక అయ్యిందన్నారు. తిరుపతి నుంచి శ్రీసిటీ వరకు ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. అలిపిరి నుంచి తిరుచానూరు వరకు జాతీయ రహదారి, మదనపల్లి నుంచి రేణిగుంటకు అక్కడ నుంచి నాయుడుపేటకు జాతీయ రహదారిని ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న అభివృద్ధే అన్నారు. కాలుష్య నివారణకు విద్యుత్ వాహనాలు అందుబాటులోకి వస్తాయని, తిరుమలకు కూడా విద్యుత్ వాహనాలనే వినియోగిస్తామన్నారు. అక్టోబర్ 2న యువనేస్తం కింద నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని అందిస్తామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖామంత్రి నారాయణ చిత్తూరు ఎంపీ శివప్రసాద్, మంత్రి అమరనాథ రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి, ఎమ్మెల్సీలు రాజసింహులు, శ్రీనివాసులు రెడ్డి, గాలి సరస్వతమ్మ, తిరుపతి, సత్యవేడు, తంబళ్లపల్లి ఎమ్మెల్యేలు, తుడా చైర్మన్ నరసింహ యాదవ్, జిల్లాకలెక్టర్ ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు.

చిత్రాలు.. తిరుపతిలో డిజిటల్‌డోర్ నెంబర్ల వ్యవస్థను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*తిరుపతిలో నగర వనం ప్రారంభం సందర్భంగా ప్రజలతో మమేకమై ర్యాలీగా నడిచి వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు