రాష్ట్రీయం

రేపటి నుండి టెన్త్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 19: రెండు తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఆంధ్రాలో ఈ పరీక్షలకు 6,57,595 మంది, తెలంగాణలో ఈపరీక్షలకు 5,56,757 మంది హాజరుకానున్నారు. ఈసారి అన్ని సున్నిత కేంద్రాల వద్ద జామర్లను ఏర్పాటు చేయడంతోపాటు కొన్ని కేంద్రాల్లో జిపిఎస్ ద్వారా టెలి నెట్‌వర్కును సైతం ట్రాకింగ్ చేయనున్నారు. ఈ సందర్భంగా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రతి కేంద్రంలో ఫస్ట్‌ఎయిడ్ సెంటర్ పెడుతున్నారు.
తెలంగాణలో
తెలంగాణలో మొత్తం 5,56,757 మంది పరీక్షలకు హాజరుకానున్నారని పరీక్షల సంచాలకుడు ఆర్ సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని ఆయన సూచించారు. ఆలస్యంగా వచ్చే వారిని పరీక్ష కేంద్రాలకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలోని అన్ని జిరాక్స్, నెట్ కేంద్రాలను మూసివేయాల్సిందిగా ఇప్పటికే పోలీసుల నుండి ఆదేశాలు వెళ్లాయి. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడే విద్యార్ధులపై ఈసారి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.
ఏపిలో
ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ పరీక్షల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేసినట్టు పరీక్షల సంచాలకుడు ప్రసన్నకుమార్‌లు చెప్పారు. టెన్త్ పరీక్షలకు 6,57,595 మంది హాజరవుతున్నారని వారికోసం 3028 కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. మార్చి 21నుండి ఈ పరీక్షలు ఏప్రిల్ 7వ తేదీ వరకూ జరుగుతాయని చెప్పారు. రెగ్యులర్ అభ్యర్ధులకు 2813, ప్రైవేటు అభ్యర్ధులకు 215 కేంద్రాలు ఏర్పాటు చేశామని, అందులో ఏ కేటగిరి కేంద్రాలు 1131, బి కేటగిరి కేంద్రాలు 1049 ఉన్నాయని చెప్పారు. సి కేటగిరి కేంద్రాలు 633 ఉన్నాయని అన్నారు. కొత్తగా ఈ ఏడాది మరో 18 కేంద్రాలు సి కేటగిరి కేంద్రాలుగా గుర్తించినట్టు వారు తెలిపారు. మొత్తం 156 ఫ్లయింగ్ స్వ్కాడ్‌లను నియమించామని సంధ్యారాణి వివరించారు. అభ్యర్ధులు ఒక్క నిమిషం ఆలస్యం కాకుండా పరీక్ష కేంద్రాలకు అర్ధగంట ముందే చేరుకోవాలని ఆమె సూచించారు.తొలి రోజు విద్యార్ధులు ఒత్తిడికి గురికాకుండా ముందే పరీక్ష కేంద్రాలు చూసుకోవాలని ఆమె పేర్కొన్నారు. అనివార్యంగా ఎవరైనా ఆలస్యం అయితే తొలి రోజు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు.