రాష్ట్రీయం

నిఘా వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం/అరకు, సెప్టెంబర్ 23: విశాఖ ఏజెన్సీలో ఆదివారం జరిగిన ఘటనకు పోలీసుల నిఘా వైఫల్యమే కారణమని ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ బంధువుల ఆరోపించారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు లేరని ఒకపక్క పోలీసు యంత్రాంగం చెప్పుకొస్తున్న నేపథ్యంలో ఉన్నపళంగా సుమారు 40 నుంచి 60 మంది సాయుధ నక్సలైట్లు గ్రామస్థుల సహకారంతో కలిసి వచ్చి, ఇద్దరు ప్రజా ప్రతినిధులను హతమార్చారంటే, ఇందులో పోలీసుల అప్రమత్తంగా లేరని చెప్పవచ్చు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతంలో నక్సలైట్ల కార్యకలాపాలు చాలావరకూ తగ్గిపోయాయి. 2015 అక్టోబర్ 24వ తేదీన ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నక్సలైట్ల దళాలు రామగుడ వద్ద భారీ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమాచారాన్ని తెలుసుకుని పోలీసుల మెరుపుదాడి చేయడంతో సుమారు 30 మంది మావోయిస్ట్‌లు చనిపోయారు. వీరిలో ఏఓబీ మావోదళాలకు నాయకత్వం వహిస్తున్న గణేష్, దయతోపాటు మావోయిస్ట్ అగ్రనేత ఆర్‌కే కుమారుడు కూడా మరణించాడు. ఆనాటి ఘటనలో ఆర్‌కే తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలి నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనతో ఏఓబీలో మావో దళాలు పూర్తిగా తుడిచి పెట్టుకు పోయాయని అంతా భావించారు. అయితే, అప్పుడప్పుడు గ్రేహౌండ్స్ పోలీసులు ఏజెన్సీలో కూంబింగ్ నిర్వహిస్తూ వస్తున్నారు. కాగా, ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకూ మావోయిస్టు పార్టీ 14వ వార్షిక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా మావోయిస్ట్‌ల
వారోత్సవాల సమయంలో వారు ఏదైనా విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉంటుందని పోలీసులు ముందుగానే అప్రమత్తమవుతారు. అయితే గడచిన రెండు సంవత్సరాల నుంచి మావోయిస్టుల కదలికలు లేకపోవడంతో పోలీసులు కాస్త రిలాక్స్ అయ్యారు. రామగుడ ఎన్‌కౌంటర్‌లో భారీ మూల్యాన్ని చెల్లించుకున్న మావోయిస్టులు అదనుకోసం ఎదురు చూస్తున్నారు. పోలీసుల నిఘా పెద్దగా లేదని భావించిన మావోయిస్ట్‌లు ప్రజాప్రతినిధులే టార్గెట్‌గా ప్రణాళిక సిద్ధం చేశారు. అనుకున్న ప్రకారమే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హతమార్చారు.
హిట్‌లిస్ట్‌లో ఉన్నా అప్రమత్తంగా లేరు!
ఆదివారం మావోయిస్ట్‌ల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మావోల హిట్‌లిస్ట్‌లో ఉన్నారు. 2009లో సివేరి సోమ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయన బాక్సైట్ తవ్వకాలకు మద్దతు పలుకుతున్నారని, దీంతోపాటు అరుకు మండలం బట్టివలసలో ఆయన క్వారీ నడపడాన్ని నక్సలైట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అలాగే సర్వేశ్వరరావు హుకుంపేట మండల గుడ వద్ద క్వారీ నిర్వహిస్తున్నారు. దీన్ని నిలిపివేయాలంటూ నక్సలైట్లు సర్వేశ్వరరావుకు లేఖలు రాశారు. ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లను కూడా వేశారు. ఇంత జరుగుతున్నా, ఈ ఇద్దరు ప్రజాప్రతినిధులకు పోలీసులు తగిన రక్షణ కల్పించలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
కాగా, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఆదివారం డుంబ్రిగుడ మండలంలో గ్రామదర్శిని కార్యక్రమానికి హాజరవుతున్నందున తమకు భద్రత కల్పించాలని అరుకు ఎస్‌ఐకి చెప్పినట్టు అరకు జెడ్పీటీసీ భర్త రమేష్ చెప్పారు. అయినా, పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. దీనివలనే సర్వేశ్వరరావు, సోమ ప్రాణాలు కోల్పోవల్సి వచ్చిందని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే కిడారికి ఇద్దరు గన్‌మెన్‌లు, సోమకు ఒక్క గన్‌మేన్ మాత్రమే ఉన్నారు. వీరివద్ద కూడా రెండు 9ఎంఎం పిస్టల్స్, ఒక కార్బన్ మాత్రమే ఉంది. వీటితో సాయుధ నక్సలైట్లను ఎదుర్కోవడం అసాధ్యమని పోలీసులకు తెలిసినా, పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేయలేకపోయారు.
హెచ్చరించాం: డీఐజి
మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఏజెన్సీలో ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించామని విశాఖ రేంజ్ డీఐజీ శ్రీకాంత్ తెలియజేశారు. ఎమ్మెల్యే సర్వేశ్వరరావు డుంబ్రిగుడ మండల పర్యటనకు వెళుతున్న సమాచారం తమకు లేదని శ్రీకాంత్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా డుంబ్రిగుడ మండలం తొట్టంగి రహదారి లిప్టిపుట్టు గ్రామం వద్ద ఎమ్మెల్యే సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యేను సోమను ఆదివారం మధ్యాహ్నం 12.15 గంటలకు నక్సలైట్లు హతమార్చారు. ఘటన జరిగిన తరువాత కూడా పోలీసులు ఆ ప్రదేశానికి రాకపోవడంతో మృతుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కిడారి మృతదేహాన్ని ఆయన వాహనంలోనూ, సివేరి మృతదేహాన్ని అతని వాహనంలోనూ అరకు తరలించారు.