రాష్ట్రీయం

ప్రశాంతత హిందువుకే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: సామాన్య ప్రజలకు, వాణిజ్య సంస్థలకు, పోలీసులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ప్రశాంతంగా పండుగలు జరుపుకోవటం హిందూవులకే సాధ్యమని శ్రీపీఠం అధిపతి శ్రీపరిపూర్ణానంద స్వామి అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద పండుగ వినాయక చవితి అని ఆయన అభివర్ణించారు. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని ఆదివారం పరిపూర్ణానంద పాతబస్తీలోని శ్రీ్భగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆ తర్వాత భాగ్యనగర్ ఉత్సవ సమితి వేదికపై నుంచి వినాయక మండపాలకు స్వాగతం పలికారు. ఎం.జే.మార్కెట్ వేదికపై నుంచి కూడా భక్తులనుద్దేశించి ప్రసంగించారు. పరిపూర్ణానంద మాట్లాడుతూ పండుగ ఈరోజు పూర్తికాలేదని, ఈరోజే మొదలైందని అన్నారు. గణపతిని నిమజ్జనం చేస్తూ ఓ కొత్తదనానికి శ్రీకారం చుడదామని అన్నారు. దేశం కోసం కోట్లాది మంది రోడ్డు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారని, హిందూ సమాజాన్ని ఏకం చేసేందుకు ఓ శక్తి తయారవుతుందని వివరించారు. శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ పరిరక్షణ కోసం అమ్మవారే తనను నియమించుకున్నారని చెప్పారు. తాను భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ఉండి చెబుతున్నానని, ఎదురుచూస్తున్న విషయం తప్పకుండా ముందుకు వస్తుందని, ప్రజలు త్వరలోనే ఓ అద్భుతమైన వార్త వింటారని స్వామిజీ చేసిన వ్యాఖ్య ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించింది. వచ్చే వినాయక చవితి లోపు మన జీవితాల్లో అద్భుతమైన మార్పులు వస్తాయని ఆకాంక్షించారు. మన దేవాలయాలను ప్రభుత్వాలపై ఆధారపడకుండా హిందూ సమాజమే రక్షించుకోవాలని సూచించారు. హిందూ సమాజాన్ని ఏకం చేసేందుకు మనందరం ఒకటిగా కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు. పాతబస్తీలో మండపాలకు స్వాగతం పలికినవారిలో మాజీ ఎమ్మెల్యే జీ. కిషన్ రెడ్డి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కన్వీనర్ డా. భగవంత్ రావు ఉన్నారు.