రాష్ట్రీయం

ఏజెన్సీకి ప్రత్యేక బలగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్ట్‌లు అతి కిరాతకంగా హతమార్చిన ఘటన తరువాత పోలీసులు అప్రమత్తమయ్యారు. సుమారు 40 నుంచి 60 మంది సాయుధ మావోయిస్ట్‌లు పోలీసుల కళ్లుకప్పి, ఇద్దరు ప్రజా ప్రతినిధులను దారుణంగా హతమార్చిన ఘటన జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. విశాఖ రేంజ్ డీఐజీ శ్రీకాంత్ నేతృత్వంలో విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, ఇతర అధికారులు ఆదివారం మధ్యాహ్నం విశాఖలో సమావేశమయ్యారు. నిఘా వైఫల్యాలను ఒకపక్క సమీక్షించుకుంటూనే, అదనపు పోలీసు బలగాలను ఏజెన్సీకి తరలించారు. సరిహద్దు ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ఏపీ గ్రేహౌండ్స్ బలగాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పోలీసులనూ అప్రమత్తం చేశారు.
సోమ, కిడారిని హతమార్చిన మావోయిస్ట్‌ల్లో అధిక సంఖ్యలో మహిళలే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరంతా పీటీజీలుగా భావిస్తున్నారు. తెలంగాణ యాసతో వీరు మాట్లాడుతున్నారు. వీరంతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారుగా భావిస్తున్నారు. ప్రజాప్రతినిధులను హతమార్చిన వెంటనే మావోయిస్ట్‌లు చాకచక్యంగా తప్పించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో గ్రేహౌండ్స్ బలగాలు వీరి కోసం వేట పారంభించాయి. ఏజెన్సీ అంతటా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. విశాఖతోపాటు విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి అటవీ ప్రాంతాల్లో బలగాలు తప్పించుకున్న మావోయిస్ట్‌ల కోసం జల్లెడ పడుతున్నాయి.