రాష్ట్రీయం

బాలరాజు కిడ్నాప్‌తో ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, పాడేరు, సెప్టెంబర్ 23: విశాఖ ఏజెన్సీలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు రక్షణ లేదన్నది మరోసారి రుజువైంది. 1991 నుంచి నక్సలైట్లు ఇక్కడి ప్రజాప్రతినిధులనే టార్గెట్‌గా చేసుకుని నరమేథం సృష్టిస్తున్నారు.
1993 నవంబర్: విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న పసుపులేటి బాలరాజును నక్సలైట్లు కిడ్నాప్ చేసి బూదరాళ్ల అటవీ ప్రాంతంలో బంధించారు. గుడ్లపల్లి దగ్గర చెక్‌డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వెళుతున్న సమయంలో సాయుధ నక్సల్స్ మెరుపుదాడి చేసి బాలరాజు సహా తొమ్మిది మందిని కిడ్నాప్ చేశారు. ఇందులో అప్పటి ఐటీడీఏ పీడీ దాసరి శ్రీనివాసులు కూడా ఉన్నారు. వరంగల్ జైల్లో ఉన్న నక్సల్స్ నాయకుడు క్రాంతి రణదేవ్‌ను విడిచిపెట్టాలన్న డిమాండ్‌తో వీరిని కిడ్నాప్ చేశారు. ద్రోణంరాజు సత్యనారాయణ ప్రభుత్వానికి, నక్సల్స్ మధ్య సయోధ్య నడిపి చివరకు రణదేవ్‌ను వరంగల్ జైల్ నుంచి విశాఖ సెంట్రల్ జైల్‌కు తరలించి, అక్కడి నుంచి భారీ బందోబస్త్ మధ్య విశాఖ ఏజెన్సీకి తరలించారు. దీంతో వారిని విడుదల చేశారు.
1996: చింతకాయల అయ్యన్నపాత్రుడు అటవీశాఖ మంత్రిగా ఉన్నారు. నక్సల్స్ అయ్యన్నపాత్రుడు సోదరుడు శ్రీనివాస్ వ్యవహారశైలిపై ఆగ్రహంతో ఉన్నారు. పదేపదే హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన చోద్యం యూపీ స్కూల్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు హతమార్చారు.
2004 మార్చి 8: బాక్సైట్‌కు మద్దతుగా పనిచేస్తున్నారన్న ఆరోపణతో అప్పటి రాష్ట్ర గిరిజన శాఖా మంత్రిగా ఉన్న మత్స్యరాస మణికుమారి భర్త వెంకటరాజును కాల్చి చంపారు.
2007 మే: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ వ్యతిరేక ఉద్యమంలో నాయకులు పదవులకు రాజీనామాలు చేసి బాక్సైట్ ఉద్యమంలో పాల్గొనాలని హెచ్చరించారు. ఈనేపథ్యంలో హుకుంపేట జెడ్పీటీసీ, జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ రవిశంకర్‌ను మావోయిస్ట్‌లు కాల్చి చంపారు. ఈ ఘటన అప్పట్లో సంచలనమైంది.
2008: ఎంపీపీ చిట్టిబాబును కూడా మావోయిస్ట్‌లు కాల్చి చంపారు.
అదేవిధంగా బాలరా జు మంత్రిగా ఉన్నప్పు డు చింతలపల్లిలోని అ తని ఆస్తులను మావోయిస్ట్‌లు దగ్ధం చేశారు. తాజాగా ఒక ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్యేని పొట్టన పెట్టుకున్నారు.