రాష్ట్రీయం

హత్యకు మావో అగ్రనేతల స్కెచ్!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే సోమను హత్య చేసేందుకు మావోయిస్ట్ అగ్రనేతలు సుమారు 40 రోజుల నుంచి స్కెచ్ వేసినట్టు సమాచారం. రామగుడ ఎన్‌కౌంటర్‌లో సుమారు 30 మందిని పొగోట్టుకున్న మావోయిస్ట్ అగ్రనేతలు అప్పటి నుంచి అదనుకోసం వేచి చూస్తున్నారు. పోలీసులను, లేదా ప్రజా ప్రతినిధులను మట్టుపెట్టేందుకు వ్యూహరచన చేస్తునే ఉన్నారు. ప్రజా ప్రతినిధులను హతమార్చితేనే ప్రభుత్వం గడగడలాడుతుందని మావోయిస్ట్‌లు భావించినట్టు సమాచారం. ఏపీ అటవీ భాగంలో దళాలన్నీ తుడిచి పెట్టుకుపోయినా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని మావోయిస్ట్‌లు మాత్రం ప్రతీకార్య చర్యకు ప్రణాళికలు రచిస్తునే ఉన్నట్టు ఆదివారం నాటి ఘటన దృష్ట్యా అర్థమవుతోంది. ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్ట్‌ల హిట్ లిస్ట్‌లో ఉన్నారు. వీరిద్దని హతమార్చడం కోసం 40 రోజుల నుంచి కోరాపుట్ మావోల దళపతి చలపతి నేతృత్వంలో స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. సోమా, సర్వేశ్వరరావు ఒకేసారి హతమార్చాలన్నది వీరి లక్ష్యం కాకపోవచ్చు. కాకతాళీయంగా వీరిద్దరూ ఒకే కార్యక్రమానికి వెళుతున్న నేపథ్యంలో మావోయిస్ట్‌లు తమ లక్ష్యాన్ని సులువుగా పూర్తి చేశారు. డుంబ్రిగుడ మండలం కండ్రూం గ్రామంలోని గ్రామదర్శిని కార్యక్రమానికి హాజరవుతున్న విషయం రెండు రోజుల కిందటే ఆ గ్రామస్థులకు సమాచారం ఉంది. ఈ కార్యక్రమానికి సోమ, సర్వేశ్వరరావు వస్తారన్న విషయం కూడా తెలియడంతో మావోయిస్ట్‌లు పగడ్బందీ వ్యూహాన్ని రచించారు. వాహనాలు ముందుగా చుట్టుముట్టడం, అందులో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే దిగి పారిపోయే వీల్లేకుండా అడ్డుకునేందుకు వీలుగా మావోయిస్ట్‌లు బృందాలుగా విడిపోయారు.
గత రెండు రోజులుగా సర్వేశ్వరరావు ప్రతి అడుగు మావోయిస్ట్‌లు గమనిస్తున్నట్టు సమాచారం. సర్వేశ్వరరావు, సోమ వాహనాల్లో బయల్దేరడం, వారి వెనుక ఎంతమంది ఉన్నారన్నది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మావోలు మాటు వేశారు. నిర్జన ప్రదేశానికి వీరి వాహనాలు వచ్చేసరికి ప్రణాళిక ప్రకారం పని పూర్తి చేశారు. మావోయిస్ట్‌ల దగ్గర వాకీటాకీలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం కార్యక్రమానికి చలపతి స్కెచ్ వేస్తే, ఏఓబీ కార్యదర్శి రామకష్ణతోపాటు మరో మహిళా కమాండర్ ప్రణాళికను అమలు చేసినట్టు తెలుస్తోంది.
గ్రామస్థుల సహకారం
ఇటీవల కాలంలో చాలామంది మావోయిస్ట్‌లు, మిలీషియా సభ్యులు పోలీసులకు లొంగిపోయారు. మావోలకు గ్రామస్థుల సహకారం కూడా అంతంతమాత్రంగానే అందుతోంది. అయినా, ఇంత పెద్ద ఆపరేషన్‌ను మావోయిస్ట్‌లు ఏవిధంగా నిర్వహించారన్నది ప్రశ్నార్థకంగా మారింది. మావోయిస్ట్‌లకు, ప్రజలకు మధ్య ఉన్న సంబంధాలను పోలీసులు పూర్తిగా తెంచేశారు. తెగిన సంబంధాలను మావోయిస్ట్‌లు మళ్లీ పునరుద్ధరించుకున్నారు. వారి సహకారంతోనే ఆదివారం నాటి దాడికి పాల్పడ్డారు. ప్రజాప్రతినిధులను వాహనాలను అడ్డగించినప్పుడు మావోయిస్ట్‌లతోపాటు గ్రామస్థులు కూడా ఉన్నారంటే వారి సహకారం మావోయిస్ట్‌లకు ఏమేరకు అందుతుందో అర్థం చేసుకోవచ్చు. వచ్చిన మావోయిస్ట్‌లు ఎమ్మెల్యే కిడారిని, సోమను గుర్తించలేదంటే, వీరు కచ్చితంగా విశాఖ ఏజెన్సీ ప్రాం తానికి చెందిన వారు కాదన్నది అర్థమవుతోంది.